ఇప్పటికే మరణశిక్ష, కుల్‌భూషణ్ జాదవ్‌పై మరో కేసు పెట్టిన పాకిస్తాన్
కరాచీ: ఇప్పటికే మరణ శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ పైన పాకిస్తాన్ మరో కేసు పెట్టింది. తమ దేశానికి భారత్ తరఫున గూఢచారిగా వచ్చాడని ఆరోపిస్తూ జాదవ్‌ను అక్రమంగా పాక్ నిర్బంధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయనకు మరణశిక్ష విధించింది.
ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి ఒత్తిడితో జాదవ్‌కు విధించిన మరణ శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అతనిపై ఉగ్రవాదం, మోసం విద్రోహం కేసులు పెట్టింది.

ఈ విషయాన్ని డాన్ పత్రిక ప్రచురిస్తూ కేసులో ఛార్జీషీటు కూడా దాఖలు చేసినట్లు వెల్లడించింది. జాదవ్‌ను ఇరాన్‌లో పట్టుకొని పాకిస్తాన్ తీసుకు వచ్చి తమ దేశంలో ఉగ్రవాద కార్యకాలాపాల కోసం ఆయన వచ్చాడని, తమ సైన్యం అతనిని అరెస్టు చేసిందని హడావుడిగా సైనిక కోర్టు ముందు నిలిపి అతనికి మరణదండన విధించింది.












Click it and Unblock the Notifications