టెక్సాస్ వర్సిటీలో కత్తితో దుండగుడు బీభత్సం: ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు.
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
దుండగుడు కూడా అదే యూనివర్సిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా, సోమవారం ఉదయం అమెరికాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

శాన్ డియోగోలో కొందరు జన్మదిన వేడుకలు జరుపుకొంటుండగా మద్యం మత్తులో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు.












Click it and Unblock the Notifications