Oneindia Exclusive:హిందువులపై దాడులు..ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి:వైతా మూర్తి

Oneindia Exclusive:బంగ్లాదేశ్‌‌లో నెలకున్న రాజకీయ అనిశ్చితిపై ప్రస్తుతం ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే లండన్‌లో రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఏమాటా తేల్చకపోవడంతో ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లోనే ఉన్నారు.

బంగ్లాదేశ్‌ రాజకీయ అనిశ్చితిపై మలేషియాలోని హిందూ కమ్యూనిటీ ప్రతినిధి, మలేషియా అడ్వాన్స్‌మెంట్ పార్టీ అధ్యక్షుడు, హిందూ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, మాజీ మంత్రి వైతా మూర్తి వన్ ఇండియాతో ప్రత్యేక ఇంటర్వూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని వైతా మూర్తి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు లేఖ రాశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, బౌద్ధులు, క్రైస్తవుల హక్కులను రక్షించాల్సిందిగా ఆయన మలేషియా ప్రధానిని కోరారు.బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింస కారణంగా మైనార్టీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మలేషియా జోక్యం చేసుకోవలని వైతా మూర్తి ప్రధాని అన్వర్ ఇబ్రహీంను కోరారు.

Oneindia Exclusive MAP HINDRAF Call on PMX to Engage with Interim Bangladesh Government

మైనార్టీలపై దాడులు చేసి హింసకు పాల్పడటాన్ని వైతా మూర్తి ఖండించారు.భారత్ బంగ్లాదేశ్‌లతో మలేషియాకు మంచి సంబంధాలున్నాయని గుర్తు చేసిన వైతా మూర్తి, భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. అక్కడి హిందువులతో పాటు ఇతర మతాలకు చెందిన ప్రజలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పాలస్తీనాలో నెలకొన్న హింసాకాండ పట్ల మలేషియా ప్రధాని ఎలాగైతే జోక్యం చేసుకున్నారో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింస పట్ల కూడా జోక్యం చేసుకుని చర్చలు జరపాలని వైతా మూర్తి సూచించారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హింస సందర్భంగా కొందరు ఇస్కాన్ ఆలయాన్ని ధ్వంసం చేశారని గుర్తుచేశారు. బంగ్లాదేశ్ జనాభాలో 8శాతం మంది హిందువుల మైనార్టీలుగా ఉన్నారని చెప్పిన వైతా మూర్తి, విద్యార్థుల నిరసనల్లో హిందువులే టార్గెట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇద్దరు హిందూ కౌన్సిలర్లు మృతి చెందినట్లు సమాచారం. హిందు మతానికి చెందిన మహిళలు కిడ్నాప్ అయినట్లు, హిందువులకు చెందిన వ్యాపార సంస్థలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+