ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై బాంబు దాడి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై జరిగిన పెట్రోలు బాంబు దాడి అంతర్జాతీయంగా కలకలం రేపింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆయన నివాసంపై శుక్రవారం తెల్లవారుజామున 4:12 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్ కాక్‌టెయిల్‌ను విసిరాడు. దీంతో ఇంటి ప్రధాన గేటు వద్ద మంటలు చెలరేగగా.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధ్రువీకరించారు. దాడి సమయంలో ఆల్ట్‌మన్ ఇంట్లో ఉన్నారా అనేది అధికారికంగా వెల్లడించలేదు.
కాగా ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే, ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి కూడా నిప్పు పెడతామంటూ దుండగుల నుంచి బెదిరింపులు రావడంతో ఆందోళన మరింత పెరిగింది. పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా 20 ఏళ్ల ఒక యువకుడిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏఐ సాంకేతికతపై ఉన్న వ్యతిరేకతతో ఈ దాడి జరిగిందా, లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది.

ఓపెన్‌ఏఐ ప్రతినిధులు ఈ దాడిని ధ్రువీకరిస్తూ, దర్యాప్తులో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. నగర నడిబొడ్డున ఒక ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటిపైనే ఇలాంటి దాడి జరగడం సిలికాన్ వ్యాలీలోని ప్రముఖులను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రముఖ సంస్థల అధిపతులు, వ్యాపారవేత్తలు తమ వ్యక్తిగత భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రతా చర్యలు మరింత కఠినం..
ఇక ఈ ఘటన తర్వాత అమెరికాలోని ప్రముఖ టెక్ సంస్థలు, ముఖ్యంగా ఏఐ రంగానికి చెందిన కంపెనీలు, తమ కార్యాలయాలు మరియు కీలక వ్యక్తుల నివాసాల వద్ద భద్రతను పెంచే చర్యలు ప్రారంభించాయి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న OpenAI అధినేతపై జరిగిన ఈ దాడి, టెక్నాలజీ అభివృద్ధి మధ్య భద్రతా సవాళ్లను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కేసు దర్యాప్తు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications