వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇనుప చైన్లతో లాడెన్‌ శవాన్ని సముద్రంలో పడేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ శవాన్ని 300 పౌండ్ల ఇనుప చైన్లతో కట్టి నల్లటి సంచీలో ఉంచి సముద్రంలో పడేశారని సిఐఎ మాడీ డైరెక్టర్ లీయోన్ పనెట్టా చెప్పారు. లాడెన్‌ను పాకిస్తాన్‌వో అబ్బొత్తబాద్‌లోని అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

లాడెన్‌ను చంపిన తర్వాత రవాణా చేసి సముద్రంలో పడేసినట్లు పనెట్టా చెప్పారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం బిన్ లాడెన్ సమాధికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెల్లటి వస్త్రం కప్పి అరబిక్‌లో ప్రార్థనలు చేసి, భారీ నల్లటి సంచీలో పెట్టారని చెప్పారు.

Osama bin Laden's body dropped into sea with 300 pounds of iron chains: Former CIA Director

లాడెన్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను పెనట్టా తన వర్తీ ఫైట్స్: ఎ మెమైర్స్ ఆఫ్ లీడర్‌షిప్ ఇన్ వార్ అండ్ పీస్ అనే పుస్తకంలో రాశారు. శవం మునిగిపోయేందుకు గాను 300 పౌండ్ల ఇనుప గొలుసులను సంచీలో పెట్టారని చెప్పారు.

సంచీలో శవాన్ని ఓడ రెయిల్ వద్ద తెల్లటి బల్లపై ఉంచారు. సముద్రంలో పడేయానికి దాన్ని వాడారు. అయితే, బల్లను కూడా శవం సముద్రంలోకి లాక్కెళ్లింది. శవం నీటిలో మునిగిన వెంటనే బల్ల పైకి తేలిందని పనెట్టా చెప్పారు. అయితే, ఎక్కడ సముద్రంలో లాడెన్ శవాన్ని సముద్రంలో పడేశారనే విషయం పనెట్టా చెప్పలేదు.

English summary
After al-Qaeda chief Osama bin Laden was killed by US special forces in Pakistan's garrison town of Abbottabad, his body was kept in a heavy black bag of 300 pounds of iron chain and dropped into the sea, former CIA Director and Defense Secretary Leon Panetta has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X