Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oscars 2022: భార్యపై కుళ్లు జోక్: స్టేజీ మీదే కమేడియన్‌ చెంప పగులగొట్టిన హాలీవుడ్ సూపర్ స్టార్

వాషింగ్టన్: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రతిష్టాత్మక 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆరంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో గల డాల్బీ థియేటర్ వేదికగా.. కొనసాగుతోంది. ఇప్పటికే పలు కేటగిరీల కింద అవార్డులు అందజేశారు నిర్వాహకులు. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్.. ఈ సంవత్సరం ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. కింగ్ రిచర్డ్ సినిమాలో అతని నటన అపూర్వం. అమెరికన్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. రెనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకుడు.

స్పోర్ట్స్ డ్రామా ఎమోషన్స్ అద్భుతం..

స్పోర్ట్స్ డ్రామా ఎమోషన్స్ అద్భుతం..

టెన్నిస్ ప్రపంచానికి సెరెనా విలియమ్స్, ఆమె సోదరి వీనస్ విలియమ్స్‌ను అందించిన వారి తండ్రి కమ్ కోచ్ రిచర్డ్ విలియమ్స్.. జీవితం ఆధారంగా దీన్ని తెర కెక్కించారు. ఆయన పేరే ఈ మూవీకి పెట్టారు. ఈ సినిమాలో రిచర్డ్ విలియమ్స్ పాత్రలో నటించాడు విల్ స్మిత్. అద్భుతంగా నటించాడు. కోచ్‌గా ఒదిగిపోయాడు. ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడీ హీరో. ఈ సినిమాలో అతని నటనకు ఆస్కార్ అవార్డ్ లభించింది.

కమేడియన్‌పై పంచ్..

కమేడియన్‌పై పంచ్..

అదంతా ఒక ఎత్తయితే- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగుతున్న సమయంలోనే కమేడియన్ క్రిస్ రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడం మరో ఎత్తు. తన భార్యపై జోక్ వేసిన కారణంతో విల్ స్మిత్ అతని చెంప పగులగొట్టాడు అందరూ చూస్తుండగానే. తొలుత- స్టేజీ మీదికి వచ్చిన క్రిస్ రాక్.. తనదైన శైలిలో అందరినీ నవ్వించాడు. అతను వేసిన జోక్స్‌కు ఓ దశలో విల్ స్మిత్, అతని భార్య జేడ్ పింకెట్ స్మిత్ సైతం ఎంజాయ్ చేశారు. పడీ పడీ నవ్వారు.

మరోసారి పేరు పలకొద్దంటూ..

అదే సమయంలో- జేడ్ పింకెట్ స్మిత్‌పై క్రిస్ రాక్ వేసిన ఓ జోక్.. అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది విన్న వెంటనే విల్ స్మిత్ వేగంగా అడుగులు వేసుకుంటూ స్టేజీ మీదికి వెళ్లాడు. ఏ మాత్రం వెనుకాముందు ఆలోచించకుండా క్రిస్ రాక్ ముఖంపై పంచ్ విసిరాడు. అతని చెంప పగులగొట్టాడు. చిరునవ్వుతో వెనక్కి తిరిగాడు. తన సీట్లో కూర్చున్న తరువాత కూడా గట్టిగా అతన్ని తిట్టడం వినిపించింది. నీ నోటి నుంచి నా భార్య పేరును మరోసారి వినదలచుకోలేదు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

డేంజిల్ వాషింగ్టన్ అభినందన..

డేంజిల్ వాషింగ్టన్ అభినందన..

ఈ ఘటనతో డాల్బీ థియేటర్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఊహించని ఈ ఘటనతో క్రిస్ రాక్ బిత్తరపోయాడు. వెంటనే తేరుకున్నాడు. మళ్లీ ట్రాక్ ఎక్కాడు. అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశాడు. కమర్షియల్ బ్రేక్ సమయంలో ప్రజెంటర్ డేనియల్ కలూయ.. విల్ స్మిత్ దగ్గరికి వెళ్లి, అతన్ని ఆలింగనం చేసుకోవడం కనిపించింది. మరో స్టార్ హీరో డేంజిల్ వాషింగ్టన్, టైలర్ పెర్రీ అతన్ని అభినందించారు. జేడ్ పింకెట్ స్మిత్‌కు విష్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+