లక్ష ఉద్యోగాలు: అమెరికాలో భారతీయ కంపెనీలు, ఆసక్తికర విషయాలు..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: భారతీయు వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నామని అమెరికా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. స్థానికతకే పెద్ద పీట వేసేలా వీసా నిబంధనలనూ సవరిస్తూ వచ్చారు. ట్రావెల్ బ్యాన్ వంటి నిబంధనలతో విదేశీ వలసలకు బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు.

ఇదంతా పక్కనపెడితే.. భారతీయుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోవడమనే మాట అటుంచితే.. భారతీయ కంపెనీలు అక్కడ లక్ష ఉద్యోగాలను కల్పించాయి. అమెరికా భూభాగంలో భారతీయ మూలాల పేరుతో వెల్లడైన ఓ రిపోర్టులో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.

అమెరికాలోని 50 రాష్ర్టాల్లో దాదాపు 100 భారత కంపెనీలు లక్షా13వేల423 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడైంది. అంతేకాదు, వచ్చే ఐదేళ్లలో అమెరికన్లకే ఉద్యోగాల్లో పెద్ద పీట వేయాలని 87శాతం భారత కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికాలో ప్రధానంగా న్యూజెర్సీ, టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, జార్జియా రాష్ట్రాల్లో భారత కంపెనీలు ఎక్కువగా ఉద్యోగాలను కల్పించినట్టు నివేదిక వెల్లడించింది.

Over 1 Lakh Jobs Created In US By Indian Companies, Says Report

అమెరికాలో కార్పోరేట్ సామాజిక బాధ్యత, ఆర్‌&డీ పరిశోధనలపై కూడా భారత కంపెనీలు భారీ మొత్తం వెచ్చిస్తున్నట్టు కంపెనీలు నివేదికలో వెల్లడైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత ఐటీ పరిశ్రమ, ఐటీ నిపుణులు చాలావరకు తోడ్పడుతున్నారని ఆ దేశంలోని భారత రాయబారి నవ్ తేజ్ అన్నారు.

దశాబ్దాలుగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారత ఐటీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులతో పాటు స్థానికులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సహకారం మరింత బలపడుతుందని యూఎస్ సెనేటర్ క్రిస్ వాన్ హెలెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian companies have created more than 113,000 jobs in the US and invested nearly $18 billion in the country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి