మత్తు మందు ఇచ్చి వంద మందికిపైగా మహిళలపై రేప్

టోక్యో: మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత వంద మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసిన వ్యక్తిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. వైద్య అధ్యయనంలో పాల్గొంటున్న అభిప్రాయం కలిగించి ఆ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

నిద్ర సమయంలో రక్తం పొటును కొలవడంపై క్లినికల్ రీసెర్చ్ పేరు మీద వచ్చిన వాణిజ్య ప్రకటనకు పెద్ద యెత్తున మహిళలు ప్రతిస్పందించినట్లు డిటెక్టివ్‌లు చెబుతున్నారు. 2013 నవంబర్ నుంచి గత రెండేళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది.

Over 100 drugged and raped in Japan fake clinical study

హిదేయుకి నోగుచి అనే 54 వ్యక్థి మహిళలను హోటళ్లకు, హాట్ స్ప్రింగ్ రిసార్ట్‌లకు రప్పించిన తర్వాత వారికి మత్తు మందు ఇచ్చేవాడని అంటున్నారు. వారు స్పృహ తప్పగానే వారిపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను చిత్రీకరించేవాడని అంటున్నారు. లైంగిక దాడికి సంబంధించిన ఫుటేజ్‌లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసేవాడని లేదా అశ్లీల చిత్రాల నిర్మాతలకు విక్రయించేవాడని ఆరోపిస్తున్నారు. ఆ రకంగా అతను 85 వేల డాలర్లకు పైగా ఆర్జించినట్లు సమాచారం.

నిజానికి నొగూచికి వైద్య శిక్షణ లేదు, వైద్య నిపుణుడు కూడా కాడు. టోక్యో, చిబా, ఒసాకా, తోచిగి, షిజౌకాలకు చెందిన యుక్తవయస్కుల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు కనీసం 39 మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. నొగూచి దాడికి గురైనవాళ్ల మహిళ సంఖ్య ఇంకా ఎక్కువగా, వందకు పైగా ఉంటుందని డిటెక్టివ్‌లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+