పాకిస్తాన్ లో హై అలర్ట్.. ! భారత్ తో యుద్దమేఘాలపై రక్షణమంత్రి షాకింగ్ ..!

భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా భారత ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేదీ ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పాకిస్తాన్ కు పంపిన హెచ్చరికల తర్వాత ఆ దేశంలో సైన్యం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఓవైపు భారత్, మరోవైపు ఆప్ఘనిస్తాన్ నుంచి ముప్పు పెరుగుతున్న వేళ పాకిస్తాన్ లో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్ తో యుద్ధం జరిగే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్-పాకిస్తాన్ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ఇవాళ స్పందించారు. స్థానిక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ.. భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశం పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉందని తెలిపారు. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణమంత్రి ఆసిఫ్ .. తాము భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం లేదని, లేదా దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.

Pak Minister s Stark Warning Can t Rule Out War With India Cites Full Alert

తన విశ్లేషణ ఆధారంగా భారతదేశం నుండి పూర్తి స్థాయి యుద్ధం లేదా ఏదైనా శత్రు వ్యూహాన్ని తాను తోసిపుచ్చలేనన్నారు. సరిహద్దు చొరబాట్లు లేదా దాడులు జరగొచ్చన్నారు. అందుకే మనం (పాకిస్తాన్ ) పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను 88 గంటల ట్రైలర్ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభివర్ణించిన కొన్ని రోజుల తర్వాత, అవసరమైతే పొరుగు దేశానికి (పాకిస్తాన్ ) బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Pak Minister s Stark Warning Can t Rule Out War With India Cites Full Alert

తాజాగా భారత్ లోని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల తర్వాత మరోసారి పాకిస్తాన్ పై యుద్దం చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడంతో కేంద్రం కూడా దీనిపై సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో
పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పటికే దూకుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తూర్పు సరిహద్దు(భారత్), పశ్చిమ సరిహద్దు( ఆప్ఘనిస్తాన్) లను ఎదుర్కోవడానికి తాము సిద్గంగా ఉన్నట్లు ప్రకటించారు. మొదటి రౌండ్‌లో అల్లాహ్ తమకు సహాయం చేశాడని, రెండవ రౌండ్‌లోనూ సహాయం చేస్తాడని చెప్పుకొచ్చారు. వారు చివరి రౌండ్ కోరుకుంటే, తమకు యుద్ధం తప్ప వేరే మార్గం లేదంటూ భారత్ పై వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+