భారత్ పై పాక్ ప్రధాని నయం కాని మాటలు

Pakistan PM Shahbaz Sharif: పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన అనంతరం భారత్ అనుసరించిన విధానాలను తప్పుపట్టారు. ఆపరేషన్ సింధూర్ నూ వదిలిపెట్టలేదు.

ప్రస్తుతం ఆయన అజర్ బైజాన్ పర్యటనలో ఉన్నారు. ఎకనామిక్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. ఇందులో ప్రసంగించారు. మరోసారి భారత్‌ పై విషం కక్కారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని సాకుగా చూపిస్తూ.. భారత్ అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించిందని షెహబాజ్ షరీఫ్ విమర్శించారు.

Pak PM Shehbaz says India using Pahalgam Terror attack to destabilize regional peace

పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం ఉపఖండంలో అశాంతి చెలరేగడానికి భారత్ కారణమైందని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ రీజియన్ ను అస్థిరపరచడానికి ప్రయత్నిందని ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలను కొనసాగిస్తోనే వస్తోందని విమర్శించారు. దీని వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యానించారు.

జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కూడా షెహబాజ్ షరీఫ్ లేవనెత్తారు. జమ్మూ కాశ్మీర్‌లో అమాయకులపై అమానుషత్వంగా భారత్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీన్ని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. ఏ దేశంలోనైనా అమాయక పౌరులపై జరిగే దాడులను పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

అది గాజా కావచ్చు, కాశ్మీర్ కావచ్చు లేదా ఇరాన్ కావచ్చు- ఏ దేశంలో అయినా అమాయకు ప్రాణాలను బలి తీసుకోవడాన్ని తాము సమర్థించబోమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గామ్ ఉగ్రవాద దాడిని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. పహల్గామ్ లో చోటు చేసుకున్న ఆ దురదృష్టకర సంఘటన తర్వాత, పాకిస్తాన్‌పై భారత్ అనుసరించిన విధానాలు అభ్యంతరకరమైనవని అన్నారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌ చోటు చేసుకున్న ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) దీనికి బాధ్యత వహించింది. దీని తరువాత భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+