భూకంపం: కరిగి, కిందకు గ్లేసియర్లు, పాక్‌కు సాయం చేస్తామని మోడీ
కరాచీ/ఢిల్లీ: హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంప ప్రభావం పాకిస్తాన్‌లోని గిల్గిట్ ప్రాంతంలోని గ్లేసియర్లు (హిమనీనదాలు) పైన చూపింది. అనేక ప్రాంతంలో గ్లేసియర్లు కరిగి కిందకు వచ్చాయి. హుంజా, స్కర్దు ప్రాంతంలో గ్లేసియర్లు కరిగినట్టుగా తెలుస్తోంది.
కాగా, ఆప్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వతాల్లో వచ్చిన భూకంపంతో పాకిస్తాన్‌లో 45 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. ఆర్మీని రంగంలోకి దించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఖైబర్ ఫక్తూన్‌లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. భూమికి 190 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. పాక్‌లో భూకంప తీవ్రతను 8.1గా గుర్తించారు. ఉత్తర భారత్‌లోను భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.
అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా: మోడీ
ఉత్తర, వాయువ్య భారతంలో పలుచోట్ల సంభవించిన భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన విషయం తెలిసిందే. భూకంప ప్రాంతంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications