వైరల్ వీడియో: మహిళా జర్నలిస్ట్ కు కన్నుకొట్టిన పాక్ లెఫ్టినెంట్ జనరల్..

పాకిస్థాన్ సైనిక అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. తన హోదాకు మచ్చ తెచ్చేలా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. గౌరవమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనులు అది కూడా బహిరంగ ప్రదేశాల్లో చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల విలేకరుల సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఆమె వైపు చూస్తూ అహ్మద్ షరీఫ్ కన్ను కొట్టారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 9న జరిగిన ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టు అబ్సా కోమల్.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పై వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరిని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్‌ను 'జాతీయ భద్రతకు ముప్పు', 'రాష్ట్ర వ్యతిరేకి', 'దిల్లీ చేతిలో కీలుబొమ్మ' తదితర ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆమె ఆ ప్రశ్నలను సంధించారు. అయితే, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (DGISPR) డైరెక్టర్ జనరల్ చౌదరి, ఆమె ప్రశ్నకు కనుసైగతో సమాధానం ఇచ్చారు.

Pakistan Army Spokesperson Winks at Female Journalist Outrage Erupts Over Unprofessional Gesture

ఈ వీడియో డిసెంబర్ 9, 2025న 'ఎలైట్ ప్రిడేటర్స్' అనే ఖాతా ద్వారా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తొలుత పోస్ట్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఓ నెటిజన్.. ఇదంతా లైవ్ లోనే బహిరంగంగా జరుగుతోంది.. అన్నాడు. పాకిస్థాన్‌ లో ప్రజాస్వామ్యం అంతమైపోయింది.. ప్రధాని కీలుబొమ్మ అని వ్యాఖ్యానించగా, మరొకరు దేశానికే ఒక మీమ్ అని అభివర్ణించారు.

మరో నెటిజన్ మాట్లాడుతూ.. అతను వృత్తిరీత్యా సైనికుడు కాదని పేర్కొన్నారు. ఇంకొకరు.. యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా కన్ను ఎలా కొట్టగలడు ?" అని ప్రశ్నించారు. మరోవైపు అహ్మద్ షరీఫ్ చౌదరి నేపథ్యం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ .. ఓ ఉగ్రవాది.. అతను ఒసామా బిన్ లాడెన్‌ కు సహాయకుడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+