బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 52 మంది మృతి, వంద మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 52 మంది మరణించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో వందమందికిపైగా గాయపడినట్లు తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు.
మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ముస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 52 మంది మరణించగా.. మరో 100 వరకు గాయపడినట్లు పాకిస్థాన్ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. క్షతగాత్రులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా, ఈ ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి కూడా ఈ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ కారు వద్దే పేలుడు సంభవించినట్లు చెప్పారు. ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధరించిటన్లు వెల్లడించారు.
ఓ సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ఘటన చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications