చైనా బ్యాంకు నుంచి 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకున్న పాకిస్తాన్, ఎందుకంటే
కరాచీ: చైనా నుంచి పాకిస్తాన్ పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంది. చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ కమర్సియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంది.
తగ్గుతున్న విదేశీ మారకపు నిల్వలను నింపేందుకు 500 మిలియన్లు డాలర్లను పాకిస్థాన్ రుణంగా తీసుకుంది. జనవరి 15న దీన్ని తీసుకున్నారని, వడ్డీ రేటు 4.5 శాతమని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

దీంతో గత జనవరిలో తీసుకున్న కొత్త రుణాల మొత్తం రూ.4533.05 కోట్లుకు పెరిగింది. ప్రస్తుతం విదేశీ రుణాల మొత్తం విలువ వార్షిక బడ్జెట్ అంచనాలో 86 శాతానికి సమానం.
గత ఏడు నెలల్లో తీసుకున్న రుణాల్లో 25 శాతం (రూ.10,302.19 కోట్లు -1.6 బిలియన్ల డాలర్లు) చైనా నుంచి పొందింది. వరుసగా రెండో ఏడాది కూడా పాకిస్తాన్ విదేశీ రుణాలు పది బిలియన్ల డాలర్లకు మించిపోతాయని అంచనా.












Click it and Unblock the Notifications