ఏడేళ్ల బాలుడి హత్య కేసులో పాక్ 'టీన్' ఉరితీత
న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో పాకిస్ధాన్‌కు చెందిన పెషాకత్ హుస్సేన్‌ను ఉరి తీసింది. నాలుగు వాయిదాల అనంతరం కరాచీ సెంట్రల్ జైలులో మంగళవారం ఉదయం అతడికి ఉరిశిక్షను అమలు చేసింది. జనవరి 14నే ఉరితీయాలనుకున్నప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.
2004లో కరాచీకి చెందిన ఏడేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో షెఫాకత్ దోషిగా కోర్టు నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. నేరం చేసిన సమయానికి షెఫాకత్ వయసు 14 సంవత్సరాలు. దీంతో మైనర్ కావడం వల్ల ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని అతని తరుపు న్యాయవాదులు కోరారు.
షెఫాకత్ ఆ హత్య కావాలని చేసింది కాదని, అసంకల్పితంగా జరిగిందని కోర్టుక తెలిపారు. ఈ వాదనకు ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో పాక్ జువెనైల్ జస్టిస్ వ్యవస్థ ప్రకారం 18 సంవత్సరాలలోపు వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయరు.

దీంతో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో అతను ఆ నేరం చేయలేదని నిరూపించుకోవడంలో సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడు. ఇక గతేడాది పెషావర్ పాఠశాలలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఉరిశిక్షల అమలుపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో షెఫాకత్‌కు ఉరిశిక్ష అమలు చేసింది.
గడచిన ఆరు సంవత్సరాల కాలంలో పాకిస్దాన్ 180 మందికి ఉరిశిక్షను అమలు చేసింది. రంజాన్ మాసంలో పాకిస్ధాన్ ఎలాంటి ఉరిశిక్షలను అమలు చేయదు. షెఫాకత్ కూడా రంజాన్ మాసం పూర్తైన తర్వాతే ఉరిశిక్షను అమలు చేసింది.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications