వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్ లో పాక్ కుట్రలు-భారత్ ను దూరంచేసేందుకే తాలిబన్లతో స్నేహం-షాకింగ్ రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో ఏర్పడిన తాలిబన్ల సర్కార్ కు పాకిస్తాన్ బహిరంగంగానే మద్దతునిస్తోంది. వారి కోసం ఐక్యరాజ్యసమితిలో సైతం పోరాడుతోంది. వారికి అంతర్జాతీయ గుర్తింపు ఇప్పించేందుకు తహతహలాడుతోంది. ఇదంతా బయటికి కనిపించే విషయమైతే.. ఇప్పుడు అంతకుమించిన డేంజర్ గేమ్ పాకిస్తాన్ ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ లో ఆడుతున్నట్లు అంతర్జాతీయ పరిశోధన నివేదికలు చెప్తున్నాయి. తాజాగా విడుదలైన యూఎస్ కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.

ఆప్ఘన్ లో పాక్ ఎత్తులు

ఆప్ఘన్ లో పాక్ ఎత్తులు

కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న ఆప్ఘనిస్తాన్ లో పాగా వేసేందుకు పొరుగున ఉన్న పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. అయితే గతంలో తాలిబన్ల పాలన స్ధానంలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటు, అనంతర పరిణామాల్లో పాకిస్తాన్ పాత్ర అక్కడ నామమాత్రంగా మారిపోయింది. దీంతో పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాశ్చాత్య దేశాలు, భారత్ మద్దతున్న ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయాలూ తీసుకోలేకోపోయింది. కానీ ఓసారి అమెరికా బలగాలు ఆఫ్ఘన్ ను వీడి తాలిబన్లు రీ ఎంట్రీ ఇచ్చాక మాత్రం పాకిస్తాన్ అక్కడ మరోసారి ఎత్తులకు పదును పెట్టడం మొదలుపెట్టింది.

 పాక్ కన్నుసన్నల్లో తాలిబన్ల సర్కార్

పాక్ కన్నుసన్నల్లో తాలిబన్ల సర్కార్

తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పాకిస్తాన్ అన్ని వ్యూహాలు అందించింది. అదే సమయంలో ప్రభుత్వంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదన్న విషయంలోనూ తమ అభిప్రాయాలు చెప్పేసింది. దీంతో పాక్ కోరుకున్నట్లుగానే హక్కానీలకు చోటిచ్చి తాలిబన్లు అంతర్జాతీయంగా విమర్శల పాలయ్యారు. అయినా పాక్ చెప్పినట్లుగానే నలుగురు హక్కానీలకు తమ ప్రభుత్వంలో తాలిబన్లు మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇప్పటికీ దాని ప్రభావం తాలిబన్ ప్రభుత్వంపై కనిపిస్తూనే ఉంది. అయినా అటు పాకిస్తాన్ కానీ, ఇటు తాలిబన్లు కానీ తమ వైఖరులు మార్చుకోవాడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

 ఆప్ఘన్ లో పాకిస్తాన్ విచ్చిన్న పాత్ర

ఆప్ఘన్ లో పాకిస్తాన్ విచ్చిన్న పాత్ర

అయితే ఆప్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ పోషిస్తున్న పాత్ర విచ్ఛిన్నకరంగా, అస్ధిరత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఉందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నవే. అయితే తాజాగా అమెరికాకు చెందిన యూఎస్ కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తమ తాజా నివేదికలోనూ ఇదే విషయాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్ తాలిబన్ల సర్కార్ కు ఇస్తున్న మద్దతు వెనుక వారి విచ్ఛిన్నకర, అస్ధిరత్వానికి అనుకూల పాత్ర ఉందని వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ ఆప్ఘన్ కు సాయం పేరిట చేస్తున్న కుట్రల వెనుక తాలిబన్లు అస్ధిరంగానే ఉండాలనే వ్యూహం ఉన్నట్లు అర్ధమవుతోంది.

భారత్ దూకుడును అడ్డుకునేందుకు పాక్ కుట్రలు ?

భారత్ దూకుడును అడ్డుకునేందుకు పాక్ కుట్రలు ?


తాలిబాన్లకు చురుకైన, నిష్క్రియాత్మక మద్దతును అందించడం ద్వారా సహా ఆఫ్ఘన్ వ్యవహారాలలో పాకిస్తాన్ చాలా కాలంగా క్రియాశీల, విఘాతం కలిగించే, అస్థిరపరిచే పాత్రను పోషిస్తోందని యూఎస్ నివేదిక తేల్చింది. తాలిబాన్ స్వాధీనం (ఆఫ్ఘనిస్తాన్) పాకిస్తాన్‌కు గణనీయమైన విజయంగా ఇప్పటికీ చాలా మంది పరిశీలకులు భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడం, అక్కడ భారతీయ ప్రభావాన్ని పరిమితం చేయడానికి దశాబ్దాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం ఈ కుట్రల వెనుక ఉద్దేశమని ఈ నివేదిక పేర్కొంది. పాకిస్థాన్‌లోని ఉన్నతాధికారులు తాలిబాన్ అనుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ, గ్రూప్ స్వాధీనం చేసుకోవడం వల్ల ఆ దేశానికి సవాళ్లు, చిక్కులు తప్పవని నివేదిక పేర్కొంది.

English summary
pakistan's disruptive role in afghanistan has exposed in a latest US congressional research service report released recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X