ఇమ్రాన్ ఖాన్‌పై 20 బిలియన్ల పరువు నష్టం దావా
ఇస్లామాబాద్: పాకిస్ధాన్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టం దావా కేసు దాఖలైంది. పాకిస్ధాన్ మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి ఈ దావా వేశారు. 2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేశారని, దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని చౌదరి పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన స్ధానిక జిల్లా కోర్టులో రూ. 20 బిలియన్ల పరువు నష్టం దావా వేశారు. కేసును స్వీకరించిన జస్టిస్ నజీర్ అహ్మాద్ గజానా జనవరి 29న ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు మందు హాజరుకావాలని ఆదేశించింది. తనపై చేసిన ఆరోపణలకు గాను గత ఏడాది ఇమ్రాన్ ఖాన్‌కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
ఏప్రిల్, 1996లో ఆయన స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) ఒకటిన్నర దశాబ్దం తరువాత 2013 మే 11న జరి గిన పాకిస్థాన్ ఎన్నికలలో మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా, తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలతో నిత్యం వార్తలలో ఉండే కైబర్ పఖ్తున్‌ఖ్వావాలో ప్రాంతీయ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications