భారత్ కు మరోసారి షాకిచ్చిన పాకిస్థాన్.. ఏడాదిన్నరగా భారీ నష్టం..

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దీని వెనక ఉన్నట్లు గుర్తించిన భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

మే7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టి వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది భారత సైన్యం. ఆ తర్వాత సింధు నదీ జలాల పంపిణీని భారత్ నిలిపివేసింది. ఈ క్రమంలోనే భారత్ విమానాలపై పాకిస్థాన్ గగనతల నిషేధాన్ని విధించింది.

అయితే అప్పుడు విధించిన నిషేధాన్ని క్రమక్రమంగా పొడిగించుకుంటూ వస్తోంది పాకిస్థాన్. తాజాగా ఆ గడువును మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ కు చెందిన విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించడాన్ని నిషేధిస్తూ విధించిన గడువును మరోసారి పొడిగిస్తూ అంటే డిసెంబర్ 24 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ నోటీస్ టూ ఎయిర్ మెన్(NOTAM) ను జారీ చేసింది.

ఈ నిషేధాజ్ఞల ప్రకారం.. భారత్ లో రిజిస్టర్ అయిన అన్ని విమానాలు, ఇండియన్ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకున్న, సొంతంగా ఆపరేట్ చేసే విమానాలు పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్లేందుకు నిషేధం. ఈ నిషేధం పాకిస్థాన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కు కూడా వర్తిస్తుంది. అటు భారత్ కూడా పాకిస్థాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ ఏప్రిల్ 30, 2025 లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిషేధం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది.

Pakistan extends the ban on Indian aircraft in its airspace once again until December 24 NOTAM

ఇక భారత్ పై గగనతలం నిషేధం అంశం గతంలోనూ పాకిస్థాన్ అమలు చేసింది. 1999 కార్గిల్ యుద్ధం, 2019 పుల్వామా సంక్షోభంలోనూ భారత్ విమానాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది పాకిస్థాన్. అయితే ఇలా ఇరు దేశాల మధ్య కంటిన్యూ గా ఎయిర్ స్పేస్ నిషేధాలు ఇరు దేశాలకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత్ విమానాలకు జర్నీ సమయం మూడు గంటలు పెరిగిందని ఇటీవల ఎయిర్ ఇండియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+