Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. 33 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులకు పాల్పడుతోంది అమెరికా. పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరించింది. ఇక ఇరాన్ సైతం ప్రతీకార దాడులను వేగవంతం చేసింది. అమెరికా భూతల దాడులు చేస్తే టెక్ సంస్థలపై దాడులు చేస్తామని ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇక యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు పెనంలోంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది.

తాజాగా పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వినియోగదారుల సూచీ గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 7 శాతం ఉండగా మార్చి పూర్తయ్యేనాటికి 7.3 శాతానికి చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8 శాతంగా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మరోవైపు పాకిస్థాన్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర 335 గా ఉంది. ఇక తాజాగా కిరోసిన్ ధరను దేశ ప్రభుత్వం పెంచింది. దాంతో లీటర్ కిరోసిన్ ధర పాకిస్థాన్ లో ప్రస్తుతం 433 కు చేరింది. ఈ నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ ను ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. వీకెండ్ లాక్ డౌన్ నిర్ణయానికి నో చెప్పడంతో రాష్ట్రాల నుంచి మద్దతు లేక కేంద్రం ఈ ప్రదిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం.

పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం కారణంగా ఏప్రిల్ 4 లేదా 5 నుంచి స్మార్ట్ లాక్ డౌన్ ప్రారంభం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ స్మార్ట్ లాక్ డౌన్ లో భాగంగా వీకెండ్ అంటే శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేత, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు నిషేధం, బహిరంగ సభలు, సమావేశాలు నిషేధం, రవాణాపై ఆంక్షలు.. ఇలా కొన్ని నిబంధనలతో ఓ ముసాయిదాను రూపొందించారు అధికారులు.

Pakistan Faces Soaring Inflation Energy Crisis Amid Rising West Asia Tension Pakistan energy crisis

ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన వీకెండ్ లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. అయితే యుద్ధం ముగిసేందుకు ఇంకా మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+