శత్రువులుగా బతకలేం: భారత్-పాక్‌పై షరీఫ్ సంచలనం
లాహోర్: భారత్ - పాకిస్తాన్ దేశాలు ఇక ఎంతమాత్రమూ శత్రువులుగా బతకలేమని పాకిస్తాన్ అధ్యక్షులు నవాజ్ షరీఫ్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల పైన చర్చించేందుకు షరీఫ్ భారత్‌ను ఆహ్వానించారు. పాకిస్తాన్‌లోని స్థానిక పత్రిక డాన్ కథనం ప్రకారం షరీఫ్ పై వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ - భారత్ ఇరు దేశాలు కూడా ప్రతి సమస్యను సమగ్రంగా పరిష్కరించుకోవాలని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కి పునాది రాయి వేసిన సందర్భంగా షరీఫ్ మాట్లాడారు.

'అన్ని రకాల అంశాలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్‌ను ఆహ్వానిస్తున్నా. ఇక ఇరుగు పొరుగు దేశాలు శత్రువులని భావిస్తే బతకలేమ'ని నవాజ్ షరీఫ్ అన్నారు.
భారత అధికారులతో నిత్యం చర్చిస్తుండాలని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జుంజువాను తాను ఆదేశించినట్లు షరీఫ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగాలని సూచించినట్లు చెప్పారు. కాగా, ప్రధాని మోడీ ఇటీవల పాకిస్తాన్‌లో హఠాత్తుగా పర్యటించారు. ఆయన పర్యటన అనంతరం నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications