బొద్దింకలు తీయండిరా బాబు.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై దారుణంగా ట్రోల్స్!

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుంది పాక్ పరిస్థతి. తీవ్ర ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (PIA) సరికొత్త రూపంలో దర్శనమిచ్చేందుకు ప్రయత్నించి నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. పదేళ్ల విరామం తర్వాత తమ ఫ్లైట్ సిబ్బంది కోసం పిఐఏ కొత్త యూనిఫామ్‌లను రూపొందించింది.

దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా నిర్వహించిన ఒక వేడుకలో ఈ కొత్త దుస్తులను ఆవిష్కరించింది. అయితే, సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న వేళ ఇలాంటి ప్రచార ఆర్బాటాలు అవసరమా అంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Pakistan International Airlines Unveils New Uniforms Amid Severe Online Criticism Over Poor Services
భారత్ దెబ్బ.. 16 నెలలు దాటినా పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదు..!!
భారత్ దెబ్బ.. 16 నెలలు దాటినా పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదు..!!

రెండు రంగుల కాంబినేషన్.. నెటిజన్ల పెదవి విరుపు!

కొత్త యూనిఫామ్‌ల కోసం డార్క్ గ్రీన్, సాఫ్ట్ గ్రే-బ్లూ రంగులను ఎంచుకున్నారు. పురుష సిబ్బంది కోసం ప్రత్యేక టైలు, జాకెట్లు రూపొందించగా.. మహిళా సిబ్బందికి కోట్లు, మ్యాచింగ్ క్యాప్‌లు, స్కార్ఫ్‌లతో కొత్త లుక్ తీసుకొచ్చారు. అయితే ఈ మార్పులపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిజైన్‌ను మార్చడంపై పెట్టిన శ్రద్ధను సేవల ప్రమాణాలు పెంచడంపై పెట్టాలని సూచిస్తున్నారు. విమానాల్లో కాక్రోచ్‌లు లేని పరిశుభ్రమైన వంటశాలలు, పనిచేసే స్క్రీన్‌లు, మంచి సీట్లు, శుభ్రమైన టాయిలెట్లు అందుబాటులోకి తేవాలని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

గిలగిలా కొట్టుకుంటున్న పాక్! రాత్రి 9 గంటలకే బంద్, పెళ్లి భోజనాలపై రూల్స్
గిలగిలా కొట్టుకుంటున్న పాక్! రాత్రి 9 గంటలకే బంద్, పెళ్లి భోజనాలపై రూల్స్

అంతర్జాతీయ మార్గాల నిలిపివేత.. సర్వీసులకు కోతలు

ఇటీవలే ఇంధన ధరల భారం నెపంతో పిఐఏ ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేసింది. దీనికి తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా యుఏఈ, గల్ఫ్ దేశాలతో పాటు బీజింగ్, కౌలాలంపూర్ వంటి ప్రధాన నగరాలకు తిరిగే అనేక విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. లేదా ట్రిప్పుల సంఖ్యను పరిమితం చేసింది. సంస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం కొంత వాటాను ప్రైవేట్ కన్సార్టియానికి విక్రయించినప్పటికీ, ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచకుండా కేవలం సిబ్బంది దుస్తులు మార్చడం వల్ల ప్రయోజనం లేదని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+