వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ సంచలన నిర్ణయం-సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలపై నిషేధం-భారత్ లో డిమాండ్ల వేళ

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ లో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని నిషేధిస్తూ రూపొందించిన బిల్లుకు జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈవీఎంల స్ధానంలో ఇకపై బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించబోతున్నారు.పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల (సవరణ) బిల్లు 2022ను జాతీయ అసెంబ్లీ ఆమోదించించినట్లు స్పీకర్ ప్రకిటంచారు. ఇది సాధారణ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని తొలగించడంతోపాటు విదేశీ పాకిస్థానీలను ఓటింగ్ నుండి అనుమతించకుండా చేస్తుందని తెలిపారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ ఈ బిల్లును మెజారిటీ ఓటుతో ఆమోదించారు. గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు మాత్రమే దీనిని వ్యతిరేకించారు.దీంతో ఈ బిల్లు సంపూర్ణ మెజారిటీతో ఆమోదం పొందింది. బిల్లును సమర్పించే ముందు, సంబంధిత స్టాండింగ్ కమిటీని దాటవేస్తూ బిల్లును నేరుగా సెనేట్‌కు పంపేందుకు అనుమతిస్తూ అబ్బాసీ ఒక తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ మెజారిటీ ఓట్లతో ఆమోదించింది. ఈ బిల్లును ఇవాళ సెనేట్‌కు పంపే అవకాశం ఉంది.

pakistan national assembly passes key bill to ban evms in national elections

ఈ చట్టం గురించి మంత్రి అజం నజీర్ తరార్ మాట్లాడుతూ, ఇది చాలా ముఖ్యమైనదని అన్నారు. మునుపటి పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం ఎన్నికల చట్టం, 2017కి అనేక సవరణలు చేసిందని, ఇందులో ఈవీఎంల వినియోగాన్ని అనుమతించడంతోపాటు విదేశీ పాకిస్థానీలకు సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కల్పించిందని ఆయన గుర్తు చేశారు.పీటీఐ ప్రభుత్వం ఎన్నికల (రెండవ సవరణ) బిల్లు, 2021 ద్వారా సవరణలు చేసింది. ఇది నవంబర్ 17, 2021న జాతీయ అసెంబ్లీలో 32 ఇతర చట్టాలతో పాటు మరుగునపడింది.

గురువారం సమర్పించిన బిల్లు ఆ సవరణలకు ముందు విధానంలో ఎన్నికల చట్టం, 2017ను పునరుద్ధరించాలని కోరిందని, ఇది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త బిల్లు ప్రకారం, చట్టంలోని సెక్షన్‌లు 94 మరియు 103కి రెండు సవరణలు చేస్తున్నామని, ఈ రెండూ విదేశీ ఓటింగ్ మరియు EVMల వినియోగానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌లను ECP నిర్వహిస్తాయని చెప్పారు. ఈవీఎంల వినియోగంపై పాకిస్థాన్ ఎన్నికల సంఘం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, అయితే సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.

English summary
paksitan national assembly has passed bill to ban evms in natioanal elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X