Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే..

పాకిస్థాన్ తన వింత వింత చేష్టలతో నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చమురు, గ్యాస్ ధరలను భారీగా పెంచేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా అక్కడి ప్రజలపై మరో భారం మోపింది. అదే 'గోబర్ టాక్స్' పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఈ వింత పన్ను ప్రవేశపెట్టింది. ఈ టాక్స్ ప్రకారం.. ఒక్కో గేదె లేదా ఆవుపై రోజుకు 30 PKR గోబర్ టాక్స్ చెల్లించాలని ఆదేశాలిచ్చింది. అంటే 10 గేదెలు ఉన్న వ్యక్తి నెలకు 9వేల PKR కట్టాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో పంజాబ్ ప్రభుత్వం నిర్ణయంపై మీమ్స్, రీల్స్ చేస్తున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Pakistan Punjab Government Imposes Gobar Tax 30 PKR Daily per Buffalo or Cow Pakistan cow tax

ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్థాన్ లో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రజలపై మరో భారాన్ని మోపింది అక్కడి ప్రభుత్వం. గోబర్ టాక్స్ పేరుతో వింత పన్ను ప్రవేశపెట్టింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. 'స్వచ్ఛ పంజాబ్' కార్యక్రమం కింద వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం సర్వీస్ ఫీజుగా వసూలు చేయనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ ఇక్కడ సీఎం కావడం గమనార్హం. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో గేదెల జనాభా అధికంగా ఉన్న 168 ప్రాంతాల్లో ఈ పన్ను ప్రవేశపెట్టారు. ఆవు లేదా గేదె పేడతో బయోగ్యాస్ ను తయారు చేసి కుకింగ్, ఎలక్ట్రిసిటీ తయారీకి వినియోగిస్తున్నారు. వేస్ట్ టూ వ్యాల్యూ కింద పంజాబ్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పన్ను నుంచి తప్పించుకునేందుకు గేదెలకు డైపర్లు తొడుగుతున్నారట యజమానులు..

ఇక ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఆ దేశాల్నే కాకుండా ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు తాజాగా పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వినియోగదారుల సూచీ గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 7 శాతం ఉండగా మార్చి పూర్తయ్యేనాటికి 7.3 శాతానికి చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8 శాతంగా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోబర్ టాక్స్ తో అక్కడి ప్రజలపై మరో భారాన్ని మోపింది ప్రభుత్వం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+