మాట వినని పాకిస్థాన్.. మరోసారి 'ఆపరేషన్ సింధూర్' పై భారత్ నిర్ణయం..?
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22న టెర్రరిస్టులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లతో పాటు తదితర ఇతర టెర్రరిస్టు స్థావరాలు కూడా ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఎంత కొట్టినా చావని పాములా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. ధ్వంసం అయిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మించుకుంటోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని బహావల్ పూర్ లోని జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందిన మార్కజ్ సుభానల్లా కాంప్లెక్స్ ను పాకిస్థాన్ తిరిగి నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గతేడాది భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఈ కాంప్లెక్స్ ను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెర్రరిస్ట్ కాంప్లెక్స్ లోని ఇన్నర్ సెంట్రల్ హాల్ ను పూర్తిగా నిర్మించారు. కొత్త పెయింటింగ్ వేశారు. మార్బుల్స్ తో ఫ్లోరింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసం అయిన ఈ కాంప్లెక్స్ ను కేవలం 15 నెలల వ్యవధిలోనే తిరిగి పాకిస్థాన్ కొత్త హంగులతో నిర్మించడం విస్మయానికి గురిచేస్తోంది.
రిపోర్ట్స్ ప్రకారం.. ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ కు పాకిస్థాన్ ప్రభుత్వం దాదాపు రూ. 25 కోట్లు అందించినట్లు తెలుస్తోంది. వీటిలో దాదాపు 11 కోట్లు కేవలం బహావల్ పూర్ లోని సుభానల్లా కాంప్లెక్స్ ను నిర్మించడానికే ఖర్చు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. ఇక తాజా రిపోర్ట్స్ ప్రకారం.. జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ స్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ హజార్ ను అనారోగ్యం కారణాలతో జైషే గ్రూప్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు జైషే హెడ్ క్వార్టర్స్ పర్యవేక్షణ అతని సోదరులు తల్హా అల్ సైఫ్ అలాగే మోహినుద్దీన్ ఔరంగజేబ్ అలియాస్ అమ్మార్ అల్విలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్ మరోసారి ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా మరోసారి ఆపరేషన్ సింధూర్ ను రీ స్టార్ట్ చేస్తామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. కానీ పాకిస్థాన్ మాత్రం భారత్ వార్నింగ్ ను లెక్కచేయడం లేదు. ఇక భారత్ రిస్క్ లు తీసుకుంటుందని.. గట్టిగా దెబ్బతీస్తుందని ఇటీవల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications