కనికరం లేని పాకిస్తాన్ ? 220 మంది ప్రాణాలు పోతాయన్నా..! ఇండిగో ఫ్లైట్ కు నో ఎంట్రీ..!
భారత్-పాకిస్తాన్ మధ్య పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిణామాలు నానాటికీ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఓవైపు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు సిందు నది నీళ్ళు ఆపేసిన భారత్.. పొరుగుదేశం విజ్ఞప్తులు చేస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భారత విమానాలకు పాకిస్తాన్ తమ గగనతలం మూసేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ 2142 కాసేపట్లో గమ్యానికి చేరుకోవాల్సి ఉంది. అయితే శ్రీనగర్ లో గాలి ఒత్తిడి కారణంగా విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ విమానంలో 220 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారు. దీంతో పైలట్ ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అది కూడా కుదరలేదు. దీంతో పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురైంది.

Unbelievable. @PTI_News reports that Lahore ATC denied this IndiGo Delhi-Srinagar flight yesterday brief use of Pak airspace to avoid bad weather/turbulence, following story broken by @bainjal.
— Shiv Aroor (@ShivAroor) May 22, 2025
Nothing should shock anyone about terrorists who hide behind airliners in war. 🤮🤮 pic.twitter.com/GglzBUtHKh
ఇందుకోసం పాకిస్తాన్ లోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను ఇండిగో విమాన పైలట్ అనుమతి కోరాడు. విమానం తీవ్ర కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో తమ గగనతలంలోకి కొద్ది దూరం మాత్రమే అనుమతించాలని వేడుకున్నాడు. కానీ భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసేసిన నేపథ్యంలో ఇండిగో విమానానికి అనుమతి ఇవ్వలేమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తేల్చేసింది. అప్పటికే తమ విమానం ఎమర్జెన్సీ పరిస్దితుల్లో ఉన్నట్లు శ్రీనగర్ ఏటీసీకి పైలట్ సమాచారం ఇచ్చినట్లు ఇదే విమానంలో ప్రయాణిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు తెలిపారు.
ఆ తర్వాత పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లేందుకు లాహోర్ ఏటీసీ కూడా అనుమతివ్వలేదు. చివరికి ఈ విమానం తీవ్ర కుదుపుల మధ్యే శ్రీనగర్ ఎయిర్ పోర్టులో దిగింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే డీజీసీఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుదుపుల కారణంగా విమానం కూడా దెబ్బతింది.












Click it and Unblock the Notifications