వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Passport Rankings: ప్రపంచంలో చెత్త పాస్ పోర్ట్ గా పాక్.. శక్తివంతమైన పాస్ పోర్ట్ గా జపాన్.. మరి భారత్..!

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌పోర్ట్‌లలో ఒకటిగా నిలిచింది. మంగళవారం లండన్‌లోని ఒక ట్రావెల్ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని 109 దేశాల పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఐదు చెత్త పాస్‌పోర్ట్‌లలో పాకిస్థానీ పాస్‌పోర్ట్ ఒకటి తేలింది. ఈ జాబితాలో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. పాక్ తర్వాత ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్

పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ ఉన్న వారు వీసా ఆన్ అరైవల్ లేదా వీసా ఫ్రీతో 35 దేశాలకు మాత్రమే ప్రయాణించగలరు. చెత్త పాస్ పోర్టు జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఆప్ఘాన్ పాస్ పోర్ట్ తో వీసా రహిత ప్రయాణాన్ని కేవలం 27 ప్రదేశాలకు మాత్రమే అనుమతి ఉంది. ఈ జాబితాలో యెమెన్ ఐదవ స్థానంలో ఉంది. యెమెన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 34 దేశాలకు వీసా రహిత చేయ్యవచ్చట.

జపాన్

జపాన్

లండన్‌కు చెందిన గ్లోబల్ సిటిజన్‌షిప్, రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం, మొత్తం 193 దేశాలకు వీసా ఆన్ అరైవల్ లేదా వీసా రహిత యాక్సెస్‌ను అందించే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో నిలించింది.

ఆసియా

ఆసియా

ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల నివేదిక ప్రతి మూడు నెలలకు హెన్లీ & భాగస్వాములచే విడుదల చేస్తాయి. జనవరి 10న విడుదల చేసిన ఈ నివేదికలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఆసియా దేశాలకు చెందిన మొదటి మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని పేర్కొంది. సింగపూర్, దక్షిణ కొరియా ఈ జాబితాలో జపాన్ తర్వాత సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాయి, వారు తమ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు 192 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను ఇస్తున్నారు.

యూరోపియన్ దేశాలు

యూరోపియన్ దేశాలు

అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఎక్కువగా యూరోపియన్ దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, ఆ తర్వాత మూడు ఆసియా దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, UK వంటి దేశాలు 187 వీసా రహిత గమ్యస్థానాలతో ఆరవ స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో, అమెరికా, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, చెక్ రిపబ్లిక్ మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాలు 186 ఉచిత వీసా గమ్యస్థానాలతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల పరంగా ఏడవ స్థానంలో ఉన్నాయి.

భారత్

భారత్

నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో భారతీయ పాస్‌పోర్ట్ 85వ స్థానంలో ఉంది. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నావారు ప్రపంచంలోని 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఇంతకుముందు భారత్ 2019లో 82 స్థానంలో ఉండాగ 2020లో 84, 2021లో 85, 2022లో 83వ స్థానంలో ఉంది. భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, మకావో, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, కెన్యా, మారిషస్, సీషెల్స్, జింబాబ్వే, ఉగాండా, ఇరాన్, ఖతార్ వంటి 59 ప్రదేశాలకు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

2023లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు:

2023లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు:

1. జపాన్ (193 గమ్యస్థానాలు)

2. సింగపూర్, దక్షిణ కొరియా (192 గమ్యస్థానాలు)

3. జర్మనీ, స్పెయిన్ (190 గమ్యస్థానాలు)

4. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ (189 గమ్యస్థానాలు)

5. ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్ (188 గమ్యస్థానాలు)

6. ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్ (187 గమ్యస్థానాలు)

7. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చెక్ రిపబ్లిక్ (186 గమ్యస్థానాలు)

8. ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, మాల్టా (185 గమ్యస్థానాలు)

9. హంగరీ, పోలాండ్ (184 గమ్యస్థానాలు)

10. లిథువేనియా, స్లోవేకియా (183 గమ్యస్థానాలు)

English summary
Pakistan's passport ranks as one of the worst passports in the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X