పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. అట్లుంటది మనతోని..
ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ఏంటో అటు పాకిస్థాన్ తో పాటు ప్రపంచ దేశాలకు అర్థమైంది. మరోవైపు పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి అపాచీ విమానాలను కొనుగోలు చేసింది. మరికొద్ది రోజుల్లో ఇవి భారత్ కు రానున్నాయి. అటు రష్యా నుంచి కూడా కీలక ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇక భారత్ ఆయుధాలను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తం అయింది. తాజాగా షాహీన్-3 మిసైల్ ను పరీక్షించింది. కానీ అది కాస్తా విఫలం అయింది. అంతేకాక ఆ క్షిపణి ఆ దేశ ప్రజలపైనే పడింది. దీంతో పాకిస్థాన్ కు సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
🔥SHOCKING RESULT:
— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) July 23, 2025
🚀Shaheen Missile-III
Target? Missed.
No Explosion
Precision? Same as their economy.
Rumour says:
It saw "India" and turned back in fear. pic.twitter.com/KmOGqlRpLG
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాకిస్థాన్ వ్యవహార శైలి కనిపిస్తోంది. ఓ వైపు భారత్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంటే అది చూసి ఓర్వలేక గొప్పలకు పోయి చేతులు కాల్చుకుంది. మరోసారి అంతర్జాతీయ మీడియా ముందు నవ్వులపాలైంది. స్వదేశంలో నిర్మించిన షాహీన్ -3 మిసైల్ పరీక్షల్లో తుస్సయింది. అంతేకాక ఆ దేశ ప్రజలపైనే కూలిపోయింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అటు ఇంటర్నేషనల్ మీడియా సైతం పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది.

పాకిస్తాన్ జులై 22 న అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన షాషీన్-3 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఆ సమయంలోనే అది గురి తప్పి మిస్ ఫైర్ అయింది. లక్ష్యాన్ని ఛేదించకుండానే బలూచిస్తాన్ ప్రావిన్సులో డేలా బుగ్టి ప్రాతంలో పేలిపోయింది. ఈ క్షిపణి శిథిలాలు జనాలు ఉండే ప్రాంతాల్లో పడడంతో వాళ్లు పరుగులు తీశారు. సైన్యం వెంటనే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ బ్లాక్ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఘటన జరిగిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదేనని భారత్ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications