సల్మాన్ ఖాన్ ఉగ్రవాది: పాకిస్థాన్ సంచలన ప్రకటన
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బిగ్ షాక్ తగిలింది. సల్మాన్ ఖాన్ ఉగ్రవాది అని పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ కు చెందిన 1997 యాంటీ టెర్రరిజం చట్టం ప్రకారం సల్మాన్ ఖాన్ పేరును 4 వ షెడ్యూల్ లో పొందుపరిచింది. బెలూచిస్తాన్ విషయంలో సల్మాన్ ఖాన్ ఇటీవల జాయ్ ఫోరమ్ 2025 లో చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మండిపడింది. టెర్రరిజంతో లింక్స్ ఉన్న వ్యక్తులను పాకిస్థాన్ లో ఈ షెడ్యూల్ కింద నమోదు చేస్తారు.
రియాద్ లో ఇటీవల జరిగిన జాయ్ ఫోరమ్ 2025 లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ కు ఆగ్రహం తెప్పించాయి. బెలూచిస్తాన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మండిపడింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ను యాంటీ టెర్రరిజం చట్టం- 1997 కింద టెర్రరిస్టుల జాబితాలో 4 వ షెడ్యూల్ లో ఆయన పేరును పొందుపరిచింది. అయితే ఆయన వ్యాఖ్యలను బెలూచిస్తాన్ వేర్పాటువాదులు స్వాగతించారు. పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అతడిపై పూర్తిస్థాయిలో నిఘా, అతడి కదలికపై ఆంక్షలు, అలాగే న్యాయపరమైన చర్యలు తీసుకోనుంది పాకిస్థాన్ ప్రభుత్వం.
ఇటీవల రియాద్ లో జరిగిన జాయ్ ఫోరమ్ 2025 లో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాకిస్థాన్, బెలూచిస్తాన్ అంటూ సల్మాన్ ఖాన్ వేరుగా ప్రస్తావించారు. మిడిల్ ఈస్ట్ లో ఇండియన్ సినిమాపై మాట్లాడారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. " ప్రస్తుతం ఓ హిందీ సినిమాను సౌదీ అరేబియాలో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తే వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. అనేక దేశాల నుంచి ప్రజలు సౌదీకి వస్తుంటారు. ఇక్కడ బెలూచిస్తాన్ ప్రజలు, అఫ్గానిస్తాన్ ప్రజలు.. అలాగే పాకిస్థాన్ ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉపాధి పొందుతున్నారు" అని సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే బెలూచిస్తాన్ ప్రజలు, పాకిస్థాన్ ప్రజలు.. అంటూ సల్మాన్ ఖాన్ వేరు చేసినట్లు మాట్లాడడం పాకిస్థాన్ ను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో బెలూచిస్తాన్ వేర్పాటువాదులను నమోదు చేసే 1997 యాంటీ టెర్రరిజం చట్టం కింద సల్మాన్ ఖాన్ పేరును ఉగ్రవాది లిస్టులో పేర్కొంది పాకిస్థాన్. బెలూచిస్తాన్.. పాకిస్థాన్ లోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. పాకిస్థాన్ లో 46 శాతం భూభాగం ఇది ఆక్రమించి ఉంది. కానీ ఇక్కడ కేవలం 6 శాతం మంది జనాభా మాత్రమే ఉంది. అంటే సుమారు 1.5 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.

బెలూచిస్తాన్.. అఫ్గానిస్తాన్, ఇరాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లతో సరిహద్దులను పంచుకుంటుంది. ఈ ప్రాంతం భౌగోళికంగా పర్వతాలు, ఎడారులు, అరేబియా సముద్ర తీరాన్ని కలిగి ఉంది. ఇక్కడ పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్ పాకిస్థాన్ లో చాలా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా చెబుతారు.












Click it and Unblock the Notifications