ఆ ట్రక్కు డ్రైవర్‌కు ఆరుగురు భార్యలు.. 54మంది సంతానం

Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్ మజీద్ మెంగాల్(70) అనే ట్రక్కు డ్రైవర్ ఏకంగా 54మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆరుగురు భార్యలతో అంతమంది సంతానాన్ని కన్న ఆయన ప్రస్తుతం వయసు మీద పడి వారిని పోషించలేక నానా కష్టాలు పడుతున్నాడు.

18ఏళ్లకే తొలి వివాహం చేసుకున్న అబ్దుల్ మజీద్.. ఆ తర్వాతి కాలంలో మరో ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అలా 54మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే ఇంతమంది సంతానంలో 12మంది చనిపోయారని, ఇద్దరు భార్యలు కూడా అనారోగ్యంతో కన్నుమూశారని చెప్పాడు.

తొలినాళ్లలో బలిష్టంగా ఉండి ఎక్కువ పనిచేసేవాడినని, అప్పుడు కుటుంబం మొత్తానికి ఏ బాధ లేకుండా చూసుకున్నాని తెలిపాడు. కానీ రాను రాను వయసైపోవడంతో కష్టాలు వెంటాడుతున్నాయన్నారు. చిన్నపిల్లలకు పాలు కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నానని వాపోతున్నాడు.

pakistan truck driver 70claims to have fathered 54children

అనారోగ్యంతో ఉన్న తన భార్యకు, బిడ్డకు చికిత్స చేయించడానికి అవసరమైన డబ్బు కోసం ఓరోజు బయటకెళ్లగా.. తాను తిరిగి వచ్చేసరికి ఇద్దరు చనిపోయారని చెప్పాడు. ఇంతమందిని పోషించడం ఇప్పుడు మరింత కష్టపడటంతో.. వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాడు.

అయితే తన తొలి సంతానంలో కొంతమంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో.. ఏదైనా ఉద్యోగం చేసి, వారే కుటుంబాన్ని పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. వారే మిగిలిన పిల్లలను బతికించాలని ధీనంగా చెబుతున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 70-year-old truck driver in Pakistan claims to have fathered 54 children with six wives because when he was younger he ‘had to have sex daily’
Please Wait while comments are loading...