బెలూచిస్తాన్‌లో పాకిస్తాన్ అకృత్యాలు, విదేశాల్లో..
లాహోర్: బెలూచిస్తాన్‌లో పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను అ ప్రాంతానికి చెందిన నేతలు విదేశాలలో ఎండగడుతున్నారు. తమ ప్రాంతంలో పాకిస్తాన్ యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్తున్నారు.
పాకిస్తాన్ ఆకృత్యాలను ఇప్పటికే పలు దేశాల దృష్టికి బెలూచిస్తాన్ నేతలు తీసుకు వెళ్లారు. తాజాగా సౌత్ కొరియాలోని బుసాన్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బెలూచిస్తాన్ ప్రజల పైన పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.

బెలూచిస్తాన్‌లో పాకిస్తాన్ 1971 నాటి దురాగతాలను పునరావృతం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్థానికుల పైన దాడులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఒకే కుటుంబానికి 19 మంది బెలూచిస్తాన్ వారిని (మహిళలు, పిల్లలతో కలిపి) ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications