అక్కాచెల్లెళ్లను రేప్ చేసిన తండ్రి: కాల్చేసిన యువతి
కరాచీ: పాకిస్తాన్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేశారు. దాంతో ఓ యువతి తన తండ్రిని మంటల్లో కాల్చేసింది. ఇందుకుగాను పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇండిపెండెంట్ వార్తాకథనం ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడే తండ్రిని చంపేయాలని పథకం వేసినట్లు కరాచీలోని పీరాబాద్‌కు చెందిన యువతి పోలీసులకు చెప్పింది. అతను ఇప్పటికే తన అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది.
అతన్ని దగ్ధం చేయడానికి ముందు అతనికి నిద్రమాత్రలు ఇచ్చినట్లు యువతి చెప్పిందని ఆమె సోదరుడు చెప్పాడు. తీవ్రంగా గాయాలపాలైన ఆ వ్యక్తి మరణించాడని పోలీసులు చెప్పారు. పోలీసుల చేతిలో అరెస్టయిన యువతి ప్రస్తుతం కరాచీలోని లియాఖతాబాద్ స్టేషన్‌లో ఉంది.












Click it and Unblock the Notifications