భారత్ బియ్యం ముద్దు.. పాకిస్థాన్ బియ్యం వద్దు.. కొనేవారు లేక..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి ఏడు నెలల్లో పాకిస్తాన్ బియ్యం ఎగుమతులు 40.5 శాతం తగ్గి 1.31 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత్.. అంతర్జాతీయ మార్కెట్‌లోకి తిరిగి రావడమే ఈ క్షీణతకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఇది పాకిస్తాన్ మార్కెట్ వాటా, ధర నిర్ణయ సామర్థ్యాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) నివేదిక ప్రకారం, బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 50.8 శాతం తగ్గి 827.8 మిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతి పరిమాణాలు గత ఏడాది 3.15 మిలియన్ టన్నుల నుండి 2.0 మిలియన్ టన్నులకు పడిపోయాయి. బాస్మతి బియ్యం ఎగుమతులు సైతం 6.62 శాతం క్షీణించి, 477.7 మిలియన్ డాలర్లు వద్ద నిలిచాయి. వాటి పరిమాణం 487,278 టన్నుల నుండి 436,484 టన్నులకు తగ్గింది.
జాతీయ ఆహార భద్రతా మంత్రిత్వ శాఖ డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశాలలో వెల్లడించిన ప్రకారం, భారతీయ సరఫరాలు పెరగడం వల్ల పాకిస్తానీ బియ్యానికి పోటీతత్వం తగ్గి ఎగుమతుల తగ్గుదలకు కారణమైంది. భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు, అలాగే దాని బియ్యం పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అధికంగా ఉండటం పాకిస్తాన్ ఎగుమతిదారులపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.

ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ గత నెలలో "డ్రాబ్యాక్ ఆఫ్ లోకల్ టాక్సెస్ అండ్ లెవీస్ ఫర్ రైస్ ఆర్డర్, 2026" కింద నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్రిక్ టన్నుకు 750 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన బాస్మతి ఎగుమతుల ఫ్రీ-ఆన్-బోర్డు (FOB) విలువపై ఇది 9 శాతం రీబేట్‌ను అనుమతిస్తుంది. జనవరి 23న ప్రకటించిన ఈ పథకం ఎగుమతిదారుల నిధుల కొరతను తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యం.
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!











Click it and Unblock the Notifications