వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయెల్-పాలస్తినా మధ్య ఘర్షణ.. 152 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అలాంటిది గుడ్ ఫ్రైడే రోజున మరోసారి ఘర్షణ జరిగింది. జెరూసలెం ఏ1 ఆక్వా మసీదు వద్ద శుక్రవారం గొడవ జరిగింది. దీంతో 152 మంది పాలస్తినీయులు గాయపడ్డారు. చాలా మందికి రబ్బర్ బుల్లెట్లు తగిలాయి. స్టన్ గ్రనేడ్స్, బ్యాటన్ల ద్వారా పోలీసులు దాడి చేశారు. నాటి సున్నితమైన ప్రాంతం వద్దే శుక్రవారం గొడవ జరిగింది.

గత రెండు వారాల నుంచి అరబ్ స్ట్రీట్ అటాక్ జరుగుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్స్ హై అలర్ట్ ప్రకటించింది. జెరూసలెం గోడతో కూడిన ఓల్డ్ సిటీ అల్ అక్సా వద్ద ఘర్షణలు.. గతేడాది గాజా యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. తూర్పు జెరూసలెంలో అల్ అక్సా సమ్మెళనం పీఠభూమిపై ఉంది. 1967లో మధ్యప్రాచ్య యుద్దంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ముస్లింలు అల్ హరమ్ అల్ షరీఫ్ అని పిలుస్తారు. యూదులకు దేవాలయం అని పిలుస్తారు.

Palestinians clash with Israeli police, 152 injured

వందలాది మంది పాలస్తీనియన్లు తమ బలగాలపై రంజాన్ ఉదయం ప్రార్థనల తర్వాత ఓల్డ్ సిటీలో గల వెస్ట్రన్ వాల్ సమీపంలో యూదుల ప్రార్థన ప్రాంతంపై పటాకులు, రాళ్లను విసిరారు. దీంతో అల్ అక్సా ప్రాంతంలోకి పోలీసులు ప్రవేశించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. ఘటన తర్వాత వందలాది మంది పాలస్తీనియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నప్తాలీ బెన్నెట్ ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు. ఆలయం, ఇజ్రాయెల్‌లో శాంతిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భద్రతా దళాలు కూడా సిద్దంగా ఉన్నాయని బెన్నెట్ వివరిచారు.

ఘటనపై పాలస్తీనా కూడా స్పందించింది. పవిత్ర స్థలంలో హింసను ప్రేరేపించింది ఎవరూ అని అడిగారు. నేరానికి ఇజ్రాయెల్ పూర్తిగా బాధ్యత వహిస్తోందని కామెంట్ చేసింది. బాధ్యత కూడా దానిదేనని పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
152 Palestinians were injured in clashes with Israeli riot police inside Jerusalem’s Al-Aqsa mosque compound on Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X