వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవాజ్ షరీఫ్‌కు సుప్రీంకోర్టు భారీ షాక్: పాక్ ప్రధానిగా తొలగింపు

పనామా గేట్‌ కేసులో పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువరిచిన పాక్‌ సుప్రీంకోర్టు.. ఆయనను ప్రధానిగా అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పనామా గేట్‌ కేసులో పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువరిచిన పాక్‌ సుప్రీంకోర్టు.. ఆయనను ప్రధానిగా అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాక్‌లో ఆకస్మిక ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడింది.

పనామా గేట్‌ కుంభకోణం కేసులో పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌, ఆయన కుటుంబసభ్యులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో షరీఫ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు గానూ అక్రమ నగదు చెలామణీకి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు దాఖలయ్యాయి.

Panama case verdict: Pakistan SC disqualifies PM Nawaz Sharif

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శుక్రవారం తుది తీర్పు వెలువరిచింది. ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అంతేగాక, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

తాజా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు పాకిస్థాన్‌లో సంచలనంగా మారింది. కోర్టు తీర్పు నేపథ్యంలో తన సోదరుడిని ప్రధాని చేయాలన్ని షరీఫ్ పాచికలు కూడా పారే అవకాశం లేకుండా పోయింది.

English summary
The Supreme Court of Pakistan ordered to disqualify Prime Minister Nawaz Sharif. Announcing their verdict in the Panama Papers case, all five judges ruled to register a case against the Shareif and ordered sending a reference against the premier and his family to an accountability court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X