భార్యాభర్తలు విడాకులు తీసుకున్నా పిల్లల వాట్సాప్ సందేశాలు చదువొచ్చు

Posted By:
Subscribe to Oneindia Telugu

మాడ్రిడ్: చిన్న పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని తల్లిదండ్రులు, సంరక్షులు పర్యవేక్షించాలని స్పెయిన్ కోర్టు తెలిపింది. వాట్సాప్ లాంటి వాటిలో ఎలాంటి సందేశాలు చూస్తున్నారో తల్లిదండ్రులకు గమనించే బాధ్యత ఉందని తెలిపింది.

భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ భార్య తన కూతురు వాట్సాప్ సందేశాలను చదువుతున్నాడని భర్తపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది వ్యక్తిగత సమాచార గోప్యత అని కింది కోర్టు తీర్పు చెప్పింది.

Parents allowed to spy on their kids' WhatsApp: Spain court rules

దీనిపై అతను పై కోర్టులో అప్పీలు చేశారు. పిల్లల వాట్సాప్‌లను తల్లిదండ్రులు చూడవచ్చునని తీర్పు చెప్పింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువవుతున్న నేపథ్యంలో పిల్లలపై శ్రద్ధ వహించాలని పేర్కొంది. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న పిల్లల సంరక్షణపై ఇద్దరికీ హక్కు ఉంటుందని తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The child’s mother presented the case to the Provincial Court of the Northern Spanish city of Pontevedra, claiming that the accused had breached his daughter’s privacy rights by reading her Whatsapp conversations, including those with the plaintiff herself.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి