వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీళ్లు: ఏడారిలో కొడుకుని బతికించుకునేందుకు ప్రాణాలొదిలారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూమెక్సికో: ఫ్రాన్స్‌లో హృదయ విదారకర సంఘటన జరిగింది. ఎడారిలో ఎండ వేడికి తాళలేక తాగేందుకు నీళ్లులేక దంపతులు మృతి చెందారు. అయితే, తమ వద్ద ఉన్న కొద్దిపాటి నీటిని తాము తాగకుండా తమ కొడుకుకు తాగిస్తూ అతని ప్రాణాలు మాత్రం కాపాడగలిగారు.

ఎడారి అందాలను చూసేందుకు పర్యాటకులుగా తమ తొమ్మిదేళ్ల కొడుకు ఎంజోను కూడా తీసుకు వెళ్లారు ఆ దంపతులు. అనుకోని పరిస్థితుల్లో ఎడారి మధ్యలో చిక్కుకుపోయి, ఎండ వేడికి తాళలేక పోయారు. అప్పటికి వారి వద్ద కొద్దిగా నీళ్లు ఉన్నాయి.

 Parents died on desert trek but saved son by giving him extra water

అయితే, కొడుకునైనా బతికించుకుందామని, వారివద్ద ఉన్న మంచినీటిని తమ కొడుకుకు ఇచ్చి, తమ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన ఫ్రాన్స్ పరిధిలోని వైట్ శాండ్స్ ప్రాంతంలో జరిగింది. వీరి గురించి వెతుకుతూ వెళ్లిన పెట్రోలింగ్ సిబ్బందికి తండ్రి మృతదేహం పక్కనే అపస్మారక స్థితిలో బాలుడు కనిపించాడు.

తండ్రి మృతదేహం పక్కనే ఖాళీగా ఉన్న రెండు వాటర్ బాటిల్స్ కనిపించాయి. ఎంజో తల్లిదండ్రులు మంచినీటినిబాలుడి కోసం దాచి వారు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. తక్కువ నీటిని తాగినా, చిన్న పిల్లాడు కావడం వల్లే ఎంజో ప్రాణాలు దక్కాయన్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ఎడారి చెడిపోయింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

English summary
The sun and heat are harsh in the summer, and shade is nowhere to be found. But from all over, people come to admire the otherworldly beauty of the wave-like white dunes and to hike a trail marked only by posts staked deep in the gypsum sand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X