వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కోసం విమానం డోర్ ఓపెన్: తప్పిన ముప్పు, ఏమైందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: విమానం టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఓ ప్రయాణీకుడు విమానానికి ఉన్న అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. దీంతో లోపలికి గాలి చొచ్చుకు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ వెంటనే విమానాన్ని టేకాఫ్ కాకుండా నిలిపివేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకొంది.

విమానంలో గాలి సరిగా రావడం లేదని విమానానికి ఉన్న అత్యవసర ద్వారం వద్ద కూర్చొన్న ప్రయాణీకుడు ఆ ద్వారాన్ని తెరిచాడు. అయితే అదే సమయంలో విమానం టేకాఫ్ అవుతోంది. దీంతో గాలి ఒక్కసారిగా విమానంలోకి వచ్చింది. ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్ జియావో ఎయిర్‌పోర్ట్‌లో ఏప్రిల్ 27వ తేదిన చోటు చేసుకొంది.

Passenger Opens Planes Emergency Door Before Takeoff - To Get Fresh Air

విమానంలోని అత్యవసర ద్వారం వద్ద కూర్చొన్న చెన్ అనే ప్రయాణీకుడు ఈ మేరకు అత్యవసరద్వారం వద్ద కూర్చొన్నాడు. గాలి రావడం లేదని అత్యవసర ద్వారాన్ని ఓపెన్ చేశాడు.

టేకాఫ్ చేయడాన్ని ఆపివేసి ఆ యువకుడిని విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అవగాహన లేని కారణంగానే తాను అత్యవసర ద్వారాన్ని ఓపెన్ చేశానని ఆ యువకుడు పోలీసులకు వివరించాడు. దీంతో 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా చెన్‌పై నిషేధం విధించారు. అంతేకాదు 70 వేల యెన్‌ల జరిమానాను కూడ విధించారు.

English summary
The passenger, who said he was feeling too hot and stifled, decided to open a window - but to his surprise, the entire "wall" collapsed and the emergency slide was deployed, reported the South China Morning Post. The incident took place at the Mianyang Nanjiao Airport on April 27, reports the Daily Mail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X