Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పఠాన్‌కోట్ దాడి వెనుక షాక్:మోడీ పాక్ టూర్‌తో లింక్

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదుల దాడిలో భారత్ ఏడుగురు ధీశాలులను కోల్పోయింది. పఠాన్‌కోట్ దాడి వెనుక... ఎన్నో కారణాలు ఉన్నాయంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. భారత్ - పాక్ మధ్య శాంతియుత చర్చలు జరగకుండా చేయడంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, పాకిస్తాన్ ఇంటర్ సెర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కలిసి పఠాన్‌కోట్ పైన తీవ్రవాద దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

సమాచారం మేరకు... భారత్ - పాకిస్తాన్‌ల మధ్య శాంతియుత చర్చల విషయంలో రహీల్ షరీఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అకస్సాత్తుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు సందర్భంగా లాహోర్‌లో పర్యటించారు.

Pathankot Terror Attack: Revealed! How was it linked with Modi's surprise visit to Pakistan

ఇరువురు ప్రధానులు శాంతియుతంగా ముందుకు సాగేందుకు సిద్ధమైనట్లుగా భావించిన ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్.. దానిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా తీవ్రవాద దాడికి ప్లాన్ చేశాడని అంటున్నారు.

పాకిస్తాన్‌లోని రావల్పిండిలో తీవ్రవాద దాడికి ప్లాన్ చేశారు. తద్వారా త్వరలో జరగనున్న ఇరు దేశాల కార్యదర్శుల సమావేశాన్ని కూడా భగ్నం చేయాలని వారి లక్ష్యంగా చెబుతున్నారు. ఈ దాడికి బాధ్యులమంటూ జిఈఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+