వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాపై మళ్లీ కరోనా పంజా-షాంఘాలో జనం ఆకలి కేకలు -పెంపుడు జంతువుల్ని పీక్కుతింటూ.-

|
Google Oneindia TeluguNews

కరోనా పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చే పేరు చైనా. ఈ మహమ్మారి పుట్టుకకు కేంద్రమైన చైనా మరోసారి కరోనాతో అల్లాడుతోంది. ముఖ్యంగా షాంఘై నగరంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. వైరస్ దెబ్బకు వ్యాపార సముదాయాలు మూతపడుతున్నాయి. జనం ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. చివరికి పెంపుడు జంతువులను పీక్కుతినే స్ధాయిలో ఆకలి కేకలు చేరిపోతున్నాయంటే అక్కడి పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

 షాంఘైపై కరోనా పంజా

షాంఘైపై కరోనా పంజా


కరోనా వైరస్ జన్మస్ధలమైన చైనాలో మరోసారి మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైంది. గత రెండేళ్లలో పలుమార్లు వ్యాప్తి చెందిన వైరస్.. ఆ తర్వాత తగ్గడం, తిరిగి మొదలు కావడం జరుగుతూనే ఉంది. వైరస్ రూపు మార్చుకుంటూ కొత్త కొత్తగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఈసారి వైరస్ విజృంభణ చైనా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది ముఖ్యంగా షాంఘై నగరం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇక్కడ జనం కోవిడ్ దెబ్బకు ఆహారం దొరక్క తీవ్ర పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. అక్కడి దృశ్యాలు ఇప్పుడు ట్విట్టర్ లో ప్రపంచాన్ని కలవరపెట్టేలా ఉన్నాయి.

26 మిలియన్ల మందిపై లాక్ డౌన్ దెబ్బ

చైనాలోని షాంఘైలో కోవిడ్ -19 వ్యాప్తి దాదాపు 26 మిలియన్ల మంది స్ధానికుల్ని లాక్‌డౌన్‌లోకి నెట్టింది. కఠినమైన ఆంక్షలు లక్షలాది మందిని తమ ఇళ్లకే పరిమితం చేశాయి. నిత్యావసరాలు కూడా దొరక్క జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటంతో జనం అల్లాడుతున్నారు. ఇళ్లలో నిల్వ చేసుకున్న ఆహారం నిండుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆకలి కేకలు పెడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోలేని పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

పెంపుడు జంతువుల్ని చంపుకు తింటూ..

షాంఘై నగరంలో నెలకొన్న పరిస్దితులతో ఆకలి బాధలు తట్టుకోలేక ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. చివరికి తాము ఇన్నాళ్లూ ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను, పక్షులను సైతం చంపుకు తినాల్సిన పరిస్ధితికి వచ్చేశారు. లేకపోతే ఆకలి కేకలతో అలాగే చావాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు ఇళ్లలో ఆహారంతో పాటు పెంపుడు జంతువులు కూడా మాయమవుతున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే రాబోయే రోజుల్లో జనం పరస్పరం చంపుకు తింటారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ట్విట్టర్లో వీడియోలు వైరల్


షాంఘైలో నెలకొన్న పరిస్ధితులపై ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అనేక వీడియోలు షాంఘై వాసులు పోరాటం, నిరాశ మధ్య ఎదుర్కొంటున్న భయానక స్థితిని వెల్లడిస్తున్నాయి. చాలా మంది ట్విటర్ వినియోగదారులు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్ ఆంక్షలు విధించడంతో సహాయం కోసం వారి కిటికీల నుండి అరుస్తున్నట్లు కూడా కొన్ని వీడియోల్లో కనిపించింది. దీంతో ఇప్పుడు ఈ వీడియోలు సైతం బాగా వైరల్ అవుతున్నాయి. షాంఘైలో మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్దితి కొనసాగవచ్చని తెలుస్తోంది.

English summary
covid 19 spread is continue in china's shanghai city as people suffered with hunger and killing own pets for their food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X