వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్ న్యూస్: ట్రంప్ మరో ట్వీట్ -బైడెన్ పగ్గాలు చేపట్టేనాటికి విలయమే -‘ఫైజర్’పై పోటాపోటీగా..

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికాలో కుర్చీ కోసం కొట్లాట ఇంకా ముమ్మరం అయింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ 290 ఓట్లు సాధించడంతో శనివారమే విజేతగా ఖరారయ్యారు. కానీ 214 ఓట్లు సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తానే గెలిచానని ప్రకటించుకున్నారు. ఓవల్ ఆఫీసును, వైట్ హౌజ్ ను అంత ఈజీగా వదులుకోబోనని ట్రంప్ సంకేతాలిచ్చారు. మరోవైపు బైడెన్.. కరోనా మహమ్మారిపై పోరుకు బ్లూ ప్రింట్ తయారీలో బిజీ అయిపోయారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోన్న ఈ ఇద్దరు నేతలు తాజాగా ఒక అంశంపై ఏకరీతి ప్రకటన చేశారు...

బైడెన్-కమలను గెలిపించా, ట్రంప్‌ నా మాట వినట్లే: కేఏ పాల్ సంచలనం -మళ్లీ రావొద్దన్న వైసీపీ ఎంపీ<br>బైడెన్-కమలను గెలిపించా, ట్రంప్‌ నా మాట వినట్లే: కేఏ పాల్ సంచలనం -మళ్లీ రావొద్దన్న వైసీపీ ఎంపీ

 ఎన్నికలతో వైరస్ విజృంభణ..

ఎన్నికలతో వైరస్ విజృంభణ..

అగ్రరాజ్యం అమెరికాలో ఎలక్షన్ హీట్ తోపాటే కరోనా మహమ్మారి కరతాళనృత్యం కొనసాగుతున్నది. ఎలక్షన్ డే(మంగళవారం) కొత్తగా 91, 530 కేసులు బయటపడగా, బుధవారం 92,215, గురువారం 1,17,988 కొత్త కేసులు, శుక్రవారం 1,26, 714 కేసులు.. చివరిగా వెల్లడైన శనివారం లెక్కల్లో కొత్తగా 1, 31, 240 కేసులు నమోదయ్యాయి. తాను ఓవల్ ఆఫీసులో పగ్గాలు చేపట్టే (జనవరి 20) నాటికి వైరస్ విలయతాండవాన్ని చూడాల్సి వస్తుందని బైడెన్ అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ముందస్తుగానే యుద్ధ సన్నద్ధత ప్రకటించిన ఆయన.. ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి కో-చైర్మన్ గా కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ ను ప్రకటించారు. మరో వైపు ట్రంప్..

ఫైజర్ ప్రకనటతో ట్రంప్, బైడెన్ హడావుడి..

ఫైజర్ ప్రకనటతో ట్రంప్, బైడెన్ హడావుడి..

ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి ప్రధాన కారణాల్లో కరోనా మేనేజ్మెంట్ వైఫల్యం కూడా ప్రధానమైనది. కేసుల సంఖ్యలో అమెరికా గతవారమే మిలియన్ మార్కును దాటేసింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 10.3లక్షలు, మరణాల సంఖ్య 2.43లక్షలుగా ఉంది. గడిచిన వారంలో భారీగా కొత్త కేసులు రావడంతో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 3.57 లక్షలకు పెరిగింది. ఇంకొద్ది రోజుల్లో విలయం తప్పేలా లేదని అందరూ భయపడుతోన్న తరుణంలో అమెరికాకే చెందిన ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ.. తన జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో కలిసి అభివృద్ధిచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 90 శాతం కన్నా ఎక్కువ సత్ఫలితాలు ఇచ్చినట్లు ప్రకటన చేసింది. ఫైజర్ సంస్థ అలా ప్రకటన చేయడమే తడవుగా ట్రంప్, బైడెన్ ల శిబిరాల్లో హడావుడి మొదలైంది..

 గ్రేట్ న్యూస్.. ఎక్సలెంట్ న్యూస్..

గ్రేట్ న్యూస్.. ఎక్సలెంట్ న్యూస్..

ఫార్మా కంపెనీ ఫైజర్ తాను రూపొందించిన కొవిడ్-19 వ్యాక్సిన్ సమర్థతపై చేసిన ప్రకటనను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గ్రేట్ న్యూస్ గా అభివర్ణించారు. వ్యాక్సిన్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు మళ్లీ రెక్కలొచ్చాయని, 90 శాతానికిపైగా ఎఫెక్ట్ చూపించే వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంటం సంతోషకరమని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ కూడా సరిగ్గా ఇదే తరహాలో ఫైజర్ సంస్థ ప్రకటనను స్వాగతిస్తూ దాన్ని ‘‘ఎక్సలెంట్ న్యూస్''గా పేర్కొన్నారు. ఈ పురోగతి వెనకున్న మహిళా, పురుషలు అందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. అయితే ప్రజలందరూ మాస్కును ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పని సరిగా ఫాలో కావాలని బైడెన్ హెచ్చరించారు.

బిగ్ డిక్లరేషన్: HBD CM Tejashwi -తమ్ముడు టిట్టూకు బర్త్ డే గిఫ్ట్ ఇదేనన్న తేజ్‌ప్రతాప్ యాదవ్బిగ్ డిక్లరేషన్: HBD CM Tejashwi -తమ్ముడు టిట్టూకు బర్త్ డే గిఫ్ట్ ఇదేనన్న తేజ్‌ప్రతాప్ యాదవ్

English summary
An announcement by Pfizer Monday that it believed its vaccine candidate is 90% effective, us president donald Trump says that the Pfizer announcement was "SUCH GREAT NEWS!", President-elect Joe Biden welcoming this "excellent news" and congratulated the "brilliant women and men" behind the breakthrough. Even with President Donald Trump still refusing to concede the election, President-elect Joe Biden will launch an aggressive plan on covid-19 crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X