కూలిన విమానం: దొరకని ఆచూకీ, ప్రార్థనలు (పిక్చర్స్)

కౌలాలంపూర్: కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ మూడు రోజుల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్-370 ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు.

మొత్తం 239 మందితో వెళ్తున్న ఈ విమానం శనివారం తెల్లవారు జామున దక్షిణ చైనా సముద్ర జలాల్లో కూలిపోయి ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే.

దీని ఆచూకీ కనుగొనేందుకు వివిధ దేశాలకు చెందిన బృందాలు నిర్విరామంగా గాలింపు జరుపుతున్నప్పటికీ కనీసం ఒక్క శకలాన్ని కూడా కనుగొనలేకపోయాయి. దీంతో ఈ విమాన అదృశ్యం వెనుక నెలకొన్న మిస్టరీ మరింత ముదురుతోంది.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

‘ఈ విమానం ఎక్కడ ఉందో తెలియలేదని, ఇప్పటివరకూ దీనికి సంబంధించిన ఒక్క వస్తువును కూడా కనుగొనలేకపోయామని మలేషియా పౌర విమానయాన విభాగం అధిపతి అజరుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ విలేఖర్ల సమావేశంలో తెలిపారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

ఈ విమానంలో ఐదుగురు భారతీయులు, భారత సంతతికి చెందిన కెనడియన్ సహా 227 మంది ప్రయాణికులు, మరో 12 మంది సిబ్బంది ఉన్న విషయం తెలిసిందే.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

విమాన అదృశ్యంపై అధికారులు అన్ని కోణాల్లోనూ పరిశీలన జరుపుతున్నారని చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం కేవలం గంట వ్యవధిలోనే అదృశ్యం కావడం వెనుక తీవ్రవాద కుట్ర ఏమైనా ఉండవచ్చన్న అనుమానంతో మలేషియా ప్రభుత్వం శనివారం దర్యాప్తును ప్రారంభించింది.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

తస్కరించిన పాస్‌పోర్టులతో ఇద్దరు వ్యక్తులు ఈ విమానంలో ఎక్కినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

ఇటలీ, ఆస్ట్రియా దేశాలకు చెందిన వీరిద్దరు ఆసియా వాసుల ముఖకవళికలను కలిగి ఉన్నారని, ఇమ్మిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించకుండా వీరిని ఈ విమానంలో ఎక్కేందుకు ఎలా అనుమతించారో ఇప్పటికీ అంతుచిక్కడం లేదని మలేషియా హోం శాఖ మంత్రి అహ్మద్ జాహిద్ హమీది శనివారం విలేఖర్లతో అన్నారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

మరోవైపు ఈ విమానం మార్గం మధ్యలోనే వెనుదిరిగి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోను విచారణ జరుపుతున్నారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

మలేసియా విమానం అన్వేషణలో పది దేశాలు... 34 విమానాలు.. 40 ఓడలతో జల్లెడ పడుతున్నాయి. సహాయానికి 10 ఉపగ్రహాలను చైనా వినియోగిస్తోంది.

 విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ మూడు రోజుల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్-370 ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ మూడు రోజుల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్-370 ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు. కుటుంబ సభ్యులు తమ వారి కోసం పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

జాడ తెలియకుండా పోయిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న అయిదుగురు భారతీయుల బంధువులు విమానం ఏమయిందనే విషయం, తమ వారి యోగక్షేమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

ఈ విమానంలో ప్రయాణిస్తున్న తన తల్లిదండ్రులు, సోదరుడి సమాచారం తెలుసుకోవడానికి సామ్‌వేద్ కోలేకర్, ఆయన భార్య 154 మంది చైనా ప్రయాణికుల బంధువులతో పాటుగా బీజింగ్‌లోని ఓ హోటల్‌లో ఎదురు చూస్తున్నారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

ఈ విమానంలో ప్రయాణిస్తున్న అయిదుగురు భారతీయుల్లో సామ్‌వేద్ తండ్రి వినోద్ కోలేకర్ (59), తల్లి చేతన (55), తమ్ముడు స్వానంద్ (23) ఉన్నారు.

విమానం మిస్సింగ్

విమానం మిస్సింగ్

మిగతా ఇద్దరు భారతీయుల్లో చంద్రికా శర్మ (51), క్రాంతి ప్రహ్లాద్ శిర్‌శథ్ ఉన్నారు. క్రాంతి భర్త ఉత్తర కొరియాలోని ప్యోంగ్యాంగ్‌లో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+