విమానాలేన్నో ఉన్నా 34ఏళ్లు పట్టింది: మోడీ, యూఈఏలో స్పెషల్ వంట

అబుదబీ: ప్రముఖ స్టార్ చెఫ్ సంజీవ్ కపూర్ ఆగస్టు 16, ఆదివారం నాడు అబుదబీ వెళ్లాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఆయనకు ప్రత్యేకంగా వెజ్ డిష్ తయారు చేసేందుకు సంజీవ్ కపూర్ అబుదబీ చేరుకున్నాడు. అబుదబీ ఇన్వెస్టిమెంట్ అథారిటీ (ఏడిఐఏ) ప్రధాని మోడీకి ప్రత్యేక విందును ఇస్తోంది. ఈ సందర్భంగా మోడీకి గత రాత్రి సంజీవ్ కపూర్ పలు వంటకాలు చేశారు.

ప్రధాని మోడీ రెండు రోజుల యూఏఈ పర్యటన నిమిత్తం ఆదివారం నాడు యుఈఏ చేరుకున్నారు. 34 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది తొలిసారి.

కాగా, భారత్ - యూఏఈల మధ్య మరింతగా బలమైన ఆర్థిక, ద్వైపాక్షిక బంధం బలపడగలదన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. భౌగోళికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా కీలకమైన యునైటెడ్ అరబ్ కింగ్‌డంలో రెండు రోజుల పర్యటనార్థం ఆదివారం ఇక్కడికి చేరుకున్న భారత ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.

కేవలం ద్వైపాక్షిక వాణిజ్యంలోనే కాకుండా ఉగ్రవాద నిరోధనలోనూ రెండు దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ‘హలో యుఏఈ.. నా పర్యటన విజయవంతం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నాను. నా పర్యటన సందర్భంగా జరిపే చర్చలు ఇరు దేశాల సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తాయన్న నమ్మకం నాకు ఉంది'అంటూ అరబిక్‌లో మోడీ ట్వీట్ చేశారు.

అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ తన ఐదుగురు సోదరులతో కలిసి వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయిలో సహాయ సహకారాలను పెంపొందించుకోవాలన్న బృహత్తర లక్ష్యంతో మోడీ సోమవారం కీలక చర్చలు జరుపుతున్నారు.

భారత్‌ కేవలం మార్కెట్‌ మాత్రమే కాదని ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. యూఏఈ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అబుదాబిలోని మస్దర్‌ నగరంలో పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... భారత్‌, యూఏఈ మధ్య చాలా విమాన సర్వీసులున్నా భారత ప్రధాని రావడానికి 34ఏళ్లు పట్టిందన్నారు.

భారత్‌లో అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు మోడీ సూచించారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, మూడీస్‌ అంగీకరించినట్లు తెలిపారు.

భారత్‌లో ప్రస్తుతం ఒక ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడికి అవకాశం ఉందని, మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరాస్తి రంగాల్లో అపార అవకాశాలున్నాయన్నారు. 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా తీర్చిదిద్దుకుందామన్నారు. మోడీ మస్దర్‌ నగరంలోని సౌరవిద్యుత్‌ కార్ల సంస్థను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+