వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లైట్‌లో చిన్నారి ప్రాణం కాపాడిన భారత సంతతి వైద్యుడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై వైద్యుడు సమయస్ఫూర్తి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలను కాపాడాయి. సెప్టెంబర్ 18న స్పెయిన్ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని రోజ్ వెల్ పార్క్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో రోబోటిక్ సర్జవిభాగం డైరెక్టరుగా ఉన్న డాక్టర్ ఖుర్షీద్ ఎయిర్ కెనడా విమానంలో స్పెయిన్ నుంచి అమెరికాకు వెళుతున్నాడు.

అదే విమానంలో ఆస్తమాతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఏడుస్తూ ఉండటాన్ని గమనించాడు. ఇన్‌హేలర్ చెక్డ్ లాగేజీలో ఉండిపోవడంతో ఏంచేయాలో తల్లిదండ్రులకు అర్ధం కావడం లేదు. దీంతో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకుందని, ఆక్సిజన్‌తో పాటు ఆస్తమా మందు కూడా ఒకేసారి అందిస్తేనే కాస్తంత ఉపశమనం పొందుతాడని గమనించారు.

PIO doctor saves asthmatic toddler's life onboard plane

కానీ విమానంలో పెద్దలకు మాత్రమే పనికొచ్చే ఆక్సిజన్ ఇన్‌హీలర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో డాక్టర్ ఖుర్షిద్ గురు సమయస్ఫూర్తితో వ్యవహరించి అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ట్యూబ్ ఓ వాటర్ బాటిల్, కప్ లను ఉపయోగించి నెబ్యులైజర్‌ను తయారు చేశారు.

ఓ వాటర్ బాటిల్‌ను కత్తిరించి, మరోవైపు చిన్న రంధ్రం చేసి ఇన్‌హేలర్‌లోని ఆక్సిజన్‌ను బాటిల్‌లోకి ఎక్కించారు. దీన్ని ఆ చిన్నారికి అందించారు. కత్తిరించిన భాగం నుంచి చిన్నారి ముక్కు దగ్గర పెట్టి ఆక్సిజన్ అందించారు. దీంతో చిన్నారికి సరిపడా ఆక్సిజన్ అంది, ఓ 30 నిమిషాల తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చాడు.

విమానం దిగే సమయానికి తన తల్లితో ఆడుకుంటున్న చిన్నారిని చూసి తనకెంతో ఆనందం కలిగిందని డాక్టర్ ఖుర్షీద్ గురు చెప్పారు. తాను రూపొందించిన నెబ్యులైజర్‌‌ను ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.

English summary
A quick-thinking Indian-origin doctor in the US has saved the life of a 2-year-old boy who suffered an asthma attack onboard a transatlantic flight by creating a makeshift inhaler out of a cup and a bottle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X