వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధానికి సిద్ధమవుతోందా?: టిబెట్‌లో అడ్వాన్స్‌డ్ ట్యాంక్‌తో తీవ్ర కసరత్తులు

భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుకు సమీపంలోనే ఉండే టిబెట్ ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ చేపట్టింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుకు సమీపంలోనే ఉండే టిబెట్ ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ చేపట్టింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 5,100మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఇలాంటి కసరత్తులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అడ్వాన్స్‌డ్ ట్యాంక్

అడ్వాన్స్‌డ్ ట్యాంక్

అంతేగాక, ఈ కసరత్తులో పీఎల్ఏకు చెందిన ఆధునిక యుద్ధ ట్యాంక్(అడ్వాన్స్‌డ్ బ్యాటిల్ ట్యాంక్)ను కూడా ఉపయోగించడం గమనించదగ్గ విషయం. ఈ టైప్ 96బీ ట్యాంక్ ను ఉపయోగించడం ద్వారా తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.

తీవ్ర కసరత్తులపై కథనాలు

తీవ్ర కసరత్తులపై కథనాలు

ఈ మేరకు జిన్హువా న్యూస్ ఏజెన్సీ కథనాలను కూడా ప్రచురితం చేసింది. ఈ టైప్ 96బీ ట్యాంక్ తొలిసారి రంగంలోకి దిగిందని ఫొటోలతో జులై 3న ప్రచురితం చేసింది. అయితే, డ్రిల్ ఎప్పుడు జరిగిందనే విషయం మాత్రం ఆ కథనంలో పేర్కొనలేదు.

తొలిసారి..

తొలిసారి..

5,100మీటర్ల ఎత్తులో తొలిసారి ఈ ట్యాంక్ దర్శనమిచ్చిందని తెలిపింది. ఈ ట్యాంక్ రావడంతో అక్కడంతా యుద్ధ వాతావరణం నెలకొందని పేర్కొంది. దీనిపై లైవ్ ఫైర్ షూటింగ్ శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపింది.

సిద్ధమవుతున్నట్లే..

సిద్ధమవుతున్నట్లే..

అధికారులు కమాండ్ స్కిల్స్ నేర్పేందుకు కూడా ఈ కసరత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అంటే చైనా ఒక వేళ యుద్ధం వచ్చినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేందుకు ఈ కసరత్తులను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, ‘భారత భద్రత బలగాలను విరమించుకోండి' అని చైనా కోరినట్లు గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే, భారత్ మాత్రం ఇందుకు నిరాకరించింది. తమను తమ భూభాగం నుంచి వెళ్లిపోమనడం ఏంటని ప్రశ్నించింది.

English summary
The People's Liberation Army's Western Theatre Command has recently held an armoured brigade military drill in Tibet at 5,100 metres above sea level for the first time to "test combat readiness".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X