Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్‌కు మాత్రం ఓటు వేయొద్దు: ఓ వృద్దురాలి కోరిక, పోస్ట్ వైరల్..

మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్.. నువ్వా నేనా అన్నట్టు ప్రచారం సాగుతోంది. రెండో టీవీ డిబేట్ కూడా హాట్ హాట్‌గా జరిగింది. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఓ పోస్ట్ తెగ వైరలవుతోంది. ఓ బామ్మ ట్రంప్‌కు ఓటు వేయద్దని కోరడమే అందులోని సారాంశం. అయితే దీనిని కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు.

మిన్నె పోలిస్‌లో గల ఇన్వర్ గ్రోవ్ హైట్స్ ‌కు చెందిన జార్జియా మే అడ్కిన్స్ (93) వృద్దురాలు. అనారోగ్యంతో సెయింట్ పాల్‌లోని యునైటెడ్ ఆస్పత్రిలో చేరింది. గతనెల 28వ తేదీన ఆమె గుండెపోటుతో చనిపోయింది. అయితే తాను చనిపోక ముందు.. తన దహన సంస్కారాలు ఎలా జరపాలో రాసింది. దీంతో కుటుంబసభ్యులు ఆ మేరకు అంత్యక్రియల ప్రక్రియ ముగించారు.

pls dont vote to donald trump..

కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించాలని వృద్దురాలు కోరారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అలాగే నిర్వహించారు. సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచొద్దని సూచించారు. దీంతో వచ్చే లాభం లేదని.. పూల వ్యాపారులను బ్రతికించడం అని పేర్కొన్నారు. దానికి బదులుగా డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయొద్దని కోరారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు తన కోరిక తీర్చాలని కోరారు. అయితే ఆ అభ్యర్థన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Recommended Video

    US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!

    జార్జియాకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు, ఇద్ద‌రు స‌వితి కుమార్తెలు ఉన్నారు. వీరికి 17 మంది మ‌న‌మ‌లు, మ‌న‌వ‌రాళ్లు కలిగారు. వారితో 24 మంది ముని మున‌మ‌లు, మ‌న‌వ‌రాళ్లు ఉండగా.. ఓ ముని ముని మ‌న‌వ‌డు కూడా ఉన్నాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+