Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

G7 Summit: జీ 7 సదస్సు వేళ మోడీ కీలక అడుగులు-మాక్రాన్, రిషీ సునాక్ తో కీలక చర్చలు..!

ఇటలీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రపంచ దేశాధినేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అసలు సదస్సుతో సంబంధం లేకుండా వీరిలో విడిగా భేటీ అవుతూ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. భారత్ తో ఆయా దేశాల సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలపై చర్చిస్తున్నారు. ప్రధాని మోడీతో భేటీ అయిన వారిలో బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు.

ముందుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో భేటీ అయిన ప్రధాని మోడీ.. ఈ భేటీలో ఇరుదేశాల సంబంధాల మెరుగుదల కోసం చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అలాగే పలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్లు ట్వీట్ చేశారు. గత ఏడాది కాలంలో ఇది తామిద్దరి మధ్య నాలుగో భేటీ అని మోడీ తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం అన్నారు.

pm modi discuss bilateral issues with macron rishi sunak on G7 sidelines

అలాగే మాక్రాన్ తో భేటీలో రక్షణ, భద్రత, సాంకేతికత, ఏఐ, బ్లూ ఎకానమీ, వంటి అనేక విషయాలను కవర్ చేసినట్లు ప్రధాని తెలిపారు. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలను ఎలా ప్రోత్సహించాలో కూడా చర్చించామన్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా మాక్రాన్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ తో జరిగిన భేటీ వివరాల్ని కూడా మోడీ ఎక్స్ లో పంచుకున్నారు. ఇందులో ఇటలీలో మూడవసారి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నా నిబద్ధతను పునరుద్ఘాటించానన్నారు. సెమీకండక్టర్లు, సాంకేతికత మరియు వాణిజ్యం వంటి రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశం ఉందని, రక్షణ రంగంలో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం గురించి కూడా మాట్లాడినట్లు మోడీ తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిగిన భేటీ వివరాలను కూడా మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చాలా మంచి సమావేశం జరిగిందని, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని మోడీ తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యద్ధం గురించి, భారతదేశం మానవ-కేంద్రీకృత విధానాన్ని విశ్వసిస్తుందని చర్చలు మరియు దౌత్యం ద్వారా శాంతికి మార్గమని విశ్వసిస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. దక్షిణ ఇటాలియన్ ప్రాంతంలోని అపులియాలో మూడు రోజుల జీ7 సమ్మిట్‌లో రెండోరోజు అయిన ఇవాళ ఇండో-పసిఫిక్, ఆర్థిక భద్రత తర్వాత వలసల సమస్యలపై ప్రపంచంలోని ఏడు ప్రముఖ పారిశ్రామిక దేశాల బృందం చర్చించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+