అక్రమ వలసల వేళ- నో మోర్..: యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌తో మోదీ భేటీలో

Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన చేపట్టారు. బుధవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఆయన భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాల సమయంలో ఆయన వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. మేరీల్యాండ్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యారు.

PM Modi meeting with US intelligence chief Tulsi Gabbard discuss various aspects

ప్రవాస భారతీయులకు పలకరింపు..

అక్కడి నుంచి నేరుగా బ్లెయిర్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. ఓ మోస్తరు వర్షంలోనూ జాతీయ పతాకాలను చేతబట్టుకుని బ్లెయిర్ హౌస్ వద్ద భారీ సంఖ్యలో బారులు తీరిన ప్రవాస భారతీయులను పలకరించారు మోదీ. వారితో ముచ్చట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినదించారు ప్రవాస భారతీయులు.

యూఎస్ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో..

ఆ వెంటనే- యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మోదీ తొలి అధికారిక సమావేశం ఇంటెలిజెన్స్ చీఫ్తో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి కొన్ని గంటల ముందే ఆమె ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

మోదీ- తులసీ గబ్బార్డ్ మధ్య..

ఈ సందర్భంగా మోదీ- తులసీ గబ్బార్డ్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. రెండోసారి ఆ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తరువాత అక్కడి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల గురించి ఆమె.. ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతున్నాయని వివరించారని సమాచారం.

ఆర్థికం, వాణిజ్యం, డిఫెన్స్..

అలాగే - వివిధ రంగాల్లోభారత్- అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సంబంధాల ప్రస్తావన సైతం వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆర్థికం, వాణిజ్యం, డిఫెన్స్..వంటి రంగాల్లో కుదుర్చుకోవాల్సిన ఒప్పందాలపై సూచనప్రాయంగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+