అరబ్ దేశంలో తొలి హిందూ ఆలయం
BAPS Mandir: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టి రెండు రోజుల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఆయన అబుధాబి నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వీడ్కోలు పలికింది ఆ దేశ ప్రభుత్వం.
అంతకుముందు- ఈ సాయంత్రం అబుధాబిలో నిర్మించిన బొచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థాన్ ఆలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామినారాయణుడి విగ్రహాన్ని తన స్వహస్తాలతో అభిషేకించారు. ధూప దీపాలను వెలిగించారు.
27 ఎకరాల్లో నిర్మితమైందీ ఆలయం. ఓ అరబ్ దేశంలో నిర్మితమైన తొలి హిందూ దేవాలయం ఇదే. అబుదాబి- దుబాయ్ షేక్ జయేద్ హైవేకు సమీపంలోని అబుమరెఖ్ ప్రాంతంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి అవరమైన స్థలాన్ని ఎమిరేట్స్ ప్రభుత్వం విరాళంగా కేటాయించింది.

ఒకేసారి 3,000 మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా విశాలంగా దీన్ని నిర్మించారు. ఓ కమ్యూనిటీ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్, లైబ్రెరీ, చిన్న పిల్లల పార్కు ఇందులోనే ఏర్పాటైంది. అయోధ్య రామమందిరాన్ని పోలి ఉండేలా నగార శైలిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. దీని ఎత్తు 108 అడుగులు.
దేవాలయం పైభాగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఏడు ఎమిరేట్స్‌కు చిహ్నాలుగా ఏడు శిఖరాలను ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత.
మయన్, ఈజిప్ట్, అరబిక్, యూరోపియన్, ఆఫ్రికా ప్రాచీన నాగరికతల్లోని కథలను మందిరంలోని గోడలపై చెక్కారు. అలాగే- భారత్‌లోని పవిత్ర జీవనదులు గంగా, యమునలను గుర్తుకుతెచ్చేలా మందిరం చుట్టు శిల్పాలను చెక్కారు.












Click it and Unblock the Notifications