వావ్.. 157 పురాతన వస్తువులు, కళాఖండాలు బహుమతి, అమెరికా గిప్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. టాప్ సీఈవోలు, ఆస్ట్రేలియా పీఎం, అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యరిస్, అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. క్వాడ్ సదస్సు, యూఎన్‌లో కూడా మాట్లాడటంతో పర్యటన ముగిసింది. అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో ఆ దేశం కానుకలను అందజేసింది. 157 కళాకృతులు, పురాతన వస్తువులను బహుమతిగా అందజేసింది.

మోడీ- బైడెన్ కలిసి ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం గురించి మాట్లాడారు. వాణిక్యం, వారసత్వ సంపద, సాంస్కృతిక అంశాలను గౌరవిద్దాం అనుకున్నారు. భారతదేశ చారిత్రక సంపధను అమెరికా గౌరవించడాన్ని మోడీ ప్రశంసించారు. మోడీకి అమెరికా అందజేసిన 157 వస్తువుల్లో నటరాజ విగ్రహాం, రాతీ విగ్రహాలు ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దానికి చెందిన వస్తువులు ఉన్నాయి.

71 వస్తువులు సాంస్కృతికంగా.. హిందుయిజానికి చెందినవి 60, బుద్దిజానికి చెందినవి 16, జైనిజానికి చెందినవి 9 ఉన్నాయి. అన్ని మెటల్, రాయికి చెందిన విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ, బుద్ద, విష్ణు, శివపార్వతీ, 24 జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి.

PM Modi to bring home 157 artefacts, antiquities handed over by US

అంతకుముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. కరోనా వైరస్ నివారణ, ప్రజల హక్కులు గురించి ఆయన డిస్కష్ చేశారు. ప్రపంచం తీవ్ర భావజాలాన్ని ఎదుర్కొంటుందని వివరించారు. యావత్ ప్రపంచం శాస్త్ర సాంకేతికంగాతోపాటు.. అభివృద్ధి గురించి ఆలోచించాలని కోరారు. దేశం అనుభవంతోపాటు మరింత నేర్చుకోవాలని కోరారు. ఆప్ఘనిస్తాన్ గురించి కూడా మోడీ మాట్లాడారు. ఆ దేశంలో ఉన్న మహిళలు, చిన్నారులు, మైనార్టీల కోసం పాడుపడాలని అభిప్రాయపడ్డారు. ఆ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు/ ఉగ్రవాదంతో ఆ దేశం ఇబ్బందులను ఎదుర్కొనేదని వివరించారు.

ఉగ్రవాదం దేశాన్ని నాశనం చేస్తుందని.. ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. గత వందేళ్లలో లేని విపత్తును ప్రపంచం ఎదుర్కొంటుందని మోడీ వివరించారు. కరోనా వైరస్ వల్ల చనిపోయిన కుటుంబాలకు ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి మోడీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుందని మోడీ గుర్తుచేశారు. దేశంలో పదుల భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు, వేషధారణ ఉన్న భారత్ ఒక ఉప ఖండం అని పేర్కొన్నారు. టీ స్టాల్‌లో టీ అమ్ముకునే చిన్నారి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం తన దేశం కల్పించిందని వివరించారు. తొలుత సీఎంగా పనిచేశానని.. ఇప్పుడు ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నానని నరేంద్ర మోడీ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+