వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

G20 Summit : భారత్ కు తొలిసారి జీ20 పగ్గాలు-అందుకోనున్న మోడీ- రిషీ సునాక్, బైడెన్ తో భేటీ !

|
Google Oneindia TeluguNews

జీ20 దేశాల కూటమికి భారత్ తొలిసారి నేతృత్వం వహించబోతోంది. ప్రస్తుతం ఇండోనేషియా చేతిలో ఉన్న ఈ కూటమి పగ్గాలు రేపు భారత్ చేతికి రాబోతున్నాయి. వీటిని అందుకునేందుకు ప్రధాని మోడీ ఇవాళ ఇండోనేషియా పయనమవుతున్నారు. అక్కడ బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ తో పాటు పలువురు దేశాధినేతల్ని మోడీ కలవబోతున్నారు. దీంతో మోడీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ కు జీ20 పగ్గాలు

భారత్ కు జీ20 పగ్గాలు


అంతర్జాతీయంగా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న అతి కొద్ది గ్రూపుల్లో జీ20 కూడా ఒకటి. ఈ కూటమికి భారత్ తొలిసారి నేతృత్వం వహించబోతోంది. ఏడాదికో దేశం ఈ గ్రూపుకు అధ్యక్షత వహిస్తుంటుంది. భారత్ కు తొలిసారి ఈ అవకాశం దక్కింది. దీంతో ఇండోనేషియా నుంచి భారత్ పగ్గాలు అందుకోవాల్సి ఉంది.రేపు, ఎల్లుండి ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగే జీ20 సదస్సులో ప్రధాని మోడీ జీ20 పగ్గాలు స్వీకరిస్తారు. ఏడాది పాటు భారత్ జీ20 దేశాలకూటమికి అధినేతగా ఉంటుంది.

పగ్గాలు అందుకోనున్న మోడీ

పగ్గాలు అందుకోనున్న మోడీ

భారత్ కు తొలిసారి జీ20 దేశాల కూటమికి నేతృత్వం వహించే అవకాశం రావడంతో దాన్ని అధికారికంగా అందుకునేందుకు ప్రధాని మోడీ ఇవాళ ఇండోనేషియా పయనమవుతున్నారు. ఇవాళ ఇండోనేషియా రాజధాని బాలి చేరుకోనున్న ప్రధాని మోడీ.. రేపు, ఎల్లుండి జరిగే సదస్సులో పాల్గొంటారు. ప్రస్తుతం ఇండోనేషియా చేతిలో ఉన్న జీ20 పగ్లాల్ని ఆ దేశం అధికారికంగా భారత్ కు ఈ సదస్సులో అప్పగించనుంది. అలాగే ప్రపంచంలో 20 దేశాల కూటమికి నేతృత్వం వహించే అవకాశం భారత్ తో పాటు ప్రధాని మోడీకి లభించబోతోంది.

రిషీ సునాక్ తో మోడీ తొలి భేటీ

రిషీ సునాక్ తో మోడీ తొలి భేటీ

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా వెళ్తున్న ప్రధాని మోడీ తన మూడు రోజుల టూర్ లో పలువురు ప్రపంచ దేశాల అధినేతల్ని కలవబోతున్నారు. ఇందులో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు కొత్తగా బ్రిటన్ పగ్గాలు చేపట్టిన భారతీయ మూలాలున్న రిషీ సునాక్ తో మోడీ భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిషీ సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయన్ను ఫోన్ లో అభినందలు తెలిపిన మోడీ.. ఇప్పుడు నేరుగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి కీలక చర్చలు జరపబోతున్నారు.

మోడీ-జిన్ పింగ్ భేటీపై సస్పెన్స్ !

మోడీ-జిన్ పింగ్ భేటీపై సస్పెన్స్ !

జీ20 సదస్సుకు ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కూడా హాజరవుతున్నారు. దీంతో గతంలో గల్వాన్ ఘర్షణల తర్వాత వీరిద్దరి మధ్య పెరిగిన దూరం నేపథ్యంలో ఈసారి వీరు భేటీ అవుతారా లేక కనీసం పలకరించుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఇరుదేశాధినేతలు చొరవ చూపితేనే ఈ భేటీ సాధ్యమయ్యేలా ఉంది. మరోవైపు జిన్ పింగ్ తో భేటీ ఎలా ఉన్నా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేలే మాక్రాన్ సహా పలుదేశాధినేతల్ని మోడీ ఈ టూర్ లో కలిసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. దీంతో ఆయా దేశాలతో భారత్ సంబంధాల్ని మరింత సుస్ధిరం చేసుకునేందుకు అవకాశం దక్కనుంది.

English summary
pm modi to fly indonasia today to take over the reins of G20. in this tour modi to meet uk pm rishi sunak and other presidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X